Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : శ్రీరామరాజ్యం(SrirAma rAjyam) (2012)
రచన:జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు(jonnavittula rAkalingEswararAo)
సంగీతం : ఇళయరాజా(iLayarAjA)
గానం : బాలు, శ్రేయా ఘోషల్, బృందం(bAlu, SrEyA ghOshal and troop)


పల్లవి :
జగదానందకారకా
జయ జానకీ ప్రాణనాయకా... ఆ...॥
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా॥
మంగళకరమౌ నీరాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమే ఇక పావనమౌగాక
నీ పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము
ప్రేమసుధామయమౌగాక॥
చరణం : 1
సార్వభౌమునిగ
పూర్ణకుంభములె స్వాగతాలు పలికే
రాజ్యమేలమని ధర్మదేవతే
రాగమాల పాడే
నాల్గువేదములు తన్మయత్వమున
జలధి మారుమ్రోగే
న్యాయదేవతే శంఖమూదగా
పూలవాన కురిసే
రాజమకుటమే ఒసగెలే
నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం
పులకించి చేసే అభివందనం
సామ్రాజ్యలక్ష్మియే పాదస్పర్శకి
పరవశించిపోయే॥
చరణం : 2
రామ పాలనము
కామధేనువని వ్యోమసీమ చాటే
రామ శాసనము తిరుగులేనిదని
జలధి బోధ చేసే
రామ దర్శనము జన్మధన్యమని
రాయి కూడ తెలిపే
రామరాజ్యమే పౌరులందరినీ
నీతిబాట నిలిపే
రామమంత్రమే తారకం
బహుశక్తి ముక్తి సంధాయకం
రామనామమే అమృతం
శ్రీరామ కీర్తనం సుకృతం
ఈ రామచంద్రుడే
లోకరక్షయని అంతరాత్మ పలికే॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |