Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : మూగమనసులు(mUgamanasulu) (1964)
రచన : ఆచార్య ఆత్రేయ(AchArya AtrEya)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : ఘంటసాల, పి.సుశీల(ghanTasAla,P.suSeela)



పల్లవి : ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడివేసెనో ||ఓ... ॥
చరణం : 1
మబ్బులు కమ్మిన ఆకాశం
మనువులు కలసిన మనకోసం॥
కలువల పందిరి వేసింది
తొలి వలపుల చినుకులు చిలికింది॥॥
చరణం : 2
నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం
నీ చేతలలో చిలిపితనం
చిత్తంలో వలపుధనం (2)
అనుభవించి దినం దినం పరవశించనా
పరవశించి క్షణం క్షణం పలవరించనా॥
చరణం : 3
ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో (2)
ఉప్పొంగి ఉరికింది గోదావరీ గోదావరీ
చెలికాని సరసలో సరికొత్త వధువులో (2)
తొలినాటి భావాలు తెలుసుకోవాలని
ఉప్పొంగి ఉరికింది గోదావరీ ॥
Special NOte:
పూర్తిపేరు : కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం మహదేవన్
జననం : 14-03-1918
జన్మస్థలం : కృష్ణన్ కోయిల్, తమిళనాడు
తల్లిదండ్రులు : లక్ష్మీఅమ్మాళ్, వెంకటాచలం అయ్యర్
తొలిచిత్రం : దేవదాసి (తమిళం)
దొంగలున్నారు జాగ్రత్త (1958) (తెలుగు)
తెలుగులో ఆఖరి చిత్రం : కబీర్‌దాస్ (2003) - ఆయన మరణానంతరం రిలీజ్ అయింది
మొత్తం చిత్రాలు : సుమారు 650పైగా (తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం)
అవార్డులు : ఉత్తమ సంగీత దర్శకునిగా రెండు జాతీయ అవార్డులు. తమిళం-కందన్ కరుణై (1967), తెలుగు-శంకరాభరణం (1979). మూడు నంది అవార్డులు (శంకరాభరణం-1979, శ్రుతిలయలు-1987, మంజీరనాదం-1991)
బిరుదులు : 1963-తిరై ఇసై తిలగం, 1967-మెల్లిసై చక్రవర్తి, 1973-కలైమామణి, 1976-స్వరబ్రహ్మ, 1976-సంగీత చక్రవర్తి
ఇతర విషయాలు : గ్రామ్‌ఫోన్ కంపెనీలో నెల జీతానికి సంగీత దర్శకులుగా కెరీర్ ప్రారంభించి, సినిమా సంగీత దర్శకులైన వారిలో మహ దేవన్ రెండవవారు. తెలుగులో మహదేవన్‌ని అందరూ ముద్దుగా ‘మామ’ అని పిలిచేవారు. మహదేవన్‌కు అసిస్టెంట్‌గా పుహళేంది దాదాపు అన్ని చిత్రాలకు పనిచేశారు. ఆచార్య ఆత్రేయ- మహదేవన్ కలయికలో ఎన్నో హిట్ పాట లొచ్చాయి. అందుకే వీరిని సినీ పరిశ్రమ ‘హిట్ కాంబినేషన్’ గా గుర్తించింది.
మరణం : 21-06-2001
మనువులు కలసిన మనకోసం॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |