Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ఇష్క్(IshQ) (2012)
రచన : అనంత శ్రీరామ్(anant SrIrAm)
సంగీతం : అరవింద్-శంకర్(aravind-Sankar)
గానం : హరిహరన్, సైంథవి(hariharan,sainthavi)


పల్లవి :
సూటిగా చూడకు...
సూదిలా నవ్వకు...
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ
ఊసురే తీయకు
సొగసే సెగలే పెడితే
చెదరదా కునుకు
సూటిగా॥
చరణం : 1
నింగిలో మెరుపల్లె తాకినది నీ కల
నేలపై మహరాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనే మించే అందం
మరుగేయగా
అంతా నీవల్లే నిముషంలో
మారిందంటా
బంతి పూవల్లే నా చూపే
విచ్చిందంటా॥
సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే
గౌరీ కళ్యాణ వైభోగమే
లక్ష్మీ కళ్యాణ వైభోగమే

చరణం : 2

గంటలో మొదలైంది కాదు
ఈ భావన
గతజన్మలో కదిలిందో ఏమో
మన మధ్యన
ఉండుండి నా గుండెల్లో
ఈ ఎదురేమిటో
ఇందాకిలా ఉందా
మరి ఎపుడెందుకో
నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి
నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |