mAnava jAti manugaDakE - మానవ జాతి మనుగడకే
చిత్రం : మాతృదేవత(mAtrudEvata) (1969)రచన : డా॥సి.నారాయణరెడ్డి(Dr||C.nArAyaNareddy)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : పి.సుశీల, బి.వసంత(P.susIla,B.vasanta)
08 March - నేడు మహిళా దినోత్సవం...
పల్లవి :
మానవ జాతి మనుగడకే
ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో
తరగని పెన్నిధి మగువ॥జాతి॥
చరణం : 1
ఒక అన్నకు ముద్దులచెల్లి
ఒక ప్రియునికి వలపుల మల్లి॥అన్నకు॥
ఒక రామయ్యనే కన్నతల్లి (2)
సకలావనికే కల్పవల్లి... ఆ... ఓ...॥జాతి॥
చరణం : 2
సీతగా ధరణిజాతగా
సహన శీలం చాటినది
రాధగా మధుర బాధగా
ప్రణయ గాథల మీటినది॥
మొల్లగా కవితలల్లగా
తేనెజల్లు కురిసినది
మొల్లగా కవితలల్లగా
తేనెజల్లు కురిసినది
లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా
సమర రంగాన దూకినది (2)॥జాతి॥
చరణం : 3
తరుణి పెదవిపై చిరునగవొలికిన
మెరయును ముత్యాలసరులు
కలకంఠి కంట కన్నీరొలికిన
తొలగిపోవురా సిరులు
కన్నకడుపున చిచ్చురగిలెనా
కరువులపాలౌను దేశం (2)
తల్లిని మించిన దైవం లేదని
తరతరాల సందేశం (2)
External Link:
mAnava jAti manugaDakE