చిత్రం : ఇష్క్(ishq) (2012)
రచన : కృష్ణచైతన్య(krishna chaitanya)
సంగీతం : అనూప్ రూబెన్స్(anUp bUbens)
గానం : రాజ్ హాసన్, అనూప్, శ్రావణి(raj hAsan,anUp,SrAvaNi)
పల్లవి :
అదిరే అదిరే...
నీ నల్లని కాటుక
కళ్లే అదిరే
అదిరే అదిరే...
నా మనసే
ఎదురు చూసి
చిన్నదాన నీకోసం...
ఓ చిన్నదాన నీకోసం (2)
నచ్చావే నచ్చావే అంటూ ఉంది
మనసీ నిమిషం
ఏదైనా ఏమైనా వేచున్నా నేను
చిన్నవాడ నీకోసం... (2)
మాటలన్ని నీకోసం...
మౌనమంత నీకోసం
చరణం : 1 కూ... అనే కోయిలా
ఉండదే రాయిలా
కొత్తపాట పాడుతుందిలా
తీయని హాయిలో తేలని గాలిలో
పెళ్లిదాక పరిచయం ఇలా
హే... ఎటువెపైళ్లినా నే నిన్నే చేరనా
మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా
జాజికొమ్మె నాచెలి
జావళీలే పాడెనురో
ప్రేమ అంటే అంతేరో అన్నీ వింతేరో
వేకువంతా నీకోసం...
వెన్నెలంతా నీకోసం...
ఊసులన్నీ నీకోసం...
ఊపిరుంది నీకోసం...
చరణం : 2
ప్రేమ పుస్తకాలలో
లేనేలేని పోలిక
రాయడం కాదు తేలిక...
మాటలే రావుగా మౌనమే హాయిగా
భావమైతే బోలెడుందిగా...
నీ నవ్వే సూటిగ తెలిపిందే రాయికా
చాల్లే తికమక అల్లుకుపోవే
ఓ... గాలిలోనే రాసినా
మన ప్రేమ అయితే చెదరదులే
అలలు అడుగున మునిగినా
తీరం చేరదులే
కాదల్ అయిన నీకోసం...
ప్రేమ అయిన నీకోసం...
లవ్ యూ అయిన నీకోసం...
ఇష్క్ అయిన నీకోసం...