Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

nA pATa nI nOTa palakAla - నా పాట నీ నోట పలకాల

చిత్రం : మూగమనసులు(mUga manasulu) (1964)
రచన : ఆచార్య ఆత్రేయ(Acharya AtrEya)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : ఘంటసాల, పి.సుశీల(ghanTasAla,P.suSIla)



పల్లవి :

నా పాట
నీ నోట
పలకాల సిలకా
నీ బుగ్గలో
సిగ్గులొలకాల
సిలకా
నా పాట నీ నోట పలకాల చిలకా
పలకాల సిలక... పలకాల చిలకా...
ఎహే... ఛీ కాదు... సి సి... సిలకా
పలకాల సిలకా... ఆ
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా
చరణం : 1
పాట నువ్వు పాడాల
పడవ నే నడపాల (2)
నీటిలో నేను నీ నీడనే సూడాల (2)
నా నీడ సూసి నువ్వు
కిలకిలా నవ్వాల (2)
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల ॥పాట॥
చరణం : 2
కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల
కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల
ఎన్నెలకే మనమంటే కన్నుకుట్టాల
ఎన్నెలకే మనమంటే కన్నుకుట్టాల
నీ పైట నా పడవ
తెరసాప
కావాల...
ఆ... ఓ...
నీ పైట నా పడవ తెరసాప కావాల
నీ సూపే సుక్కానిగా దారి సూపాల
నీ సూపే సుక్కానిగా దారి సూపాల ॥పాట॥
చరణం : 3
మనసున్న మనుసులే మనకు దేవుళ్లు
మనసు కలిసిన నాడే
మనకు తిరణాళ్లు॥
సూరేసెంద్రులతోటి సుక్కల్ల తోటి
సూరేసెంద్రులతోటి సుక్కల్ల తోటి
ఆటాడుకుందాము ఆడనే ఉందాము
ఆటాడుకుందాము ఆడనే ఉందాము
॥పాట॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |