neepErE teliyadugA(journey) - నీపేరే తెలియదుగా(జర్నీ)
చిత్రం : జర్నీ(journey) (2012)రచన : సాహితి(sAhiti)
సంగీతం : సత్య(satya)
గానం : అనురాధా శ్రీరామ్(anurAdhA SrIrAm)
పల్లవి :
సయ్యా... ఆ... సయ్యా...
నీపేరే తెలియదుగా...
నిను పిలువగలేను కదా
నే నీకో పేరిడినా నీకే తెలియదుగా
ఆ పేరే విననోళ్లు
మరి ఎవ్వరు లేరు కదా
ఆ పేరొకపరి వింటే
నిద్దుర రాదు సుమా
నే ప్రతిరోజు నిను తలచి
పులకించనా
నా మిన్నంటు మమతలతో
నిను మించనా
చరణం : 1
ఓ... ఆ పేరు వె చ్చని కిరణం
పలికేటి పెదవుల మధురం
సూర్యుడే నీవనుకుంటే సరికాదులే
ఓ... ఆ పేరే చిరు చలికాలం
వినగానే ఝల్లను హృదయం
నది అని నీవనుకుంటే అది కాదులే
కదలని ఆ... శిలకాదు
బెదిరించే పులి కాదు
తన పేరిక ఏదైనా
అది మరు పేరే కాదు
నా పేరుతో చేరే పేరే నే చెప్పనా
చరణం : 2
మహ పెద్ద పేరే తనది
గొంతు మరి కొరబోతుంది
అక్షరాలు ఎన్నని అంటే
అంతు తెలియదే
ఓ... అతి చిన్న పేరు తనది
చిటికెలో అయిపోతుంది
ఆ పేరు తీరుని తెలిపే భాష లేదులే
అధరాల కలయికగా
ఆ పేరే పలుకంగా
అది తేటల తెలుగు వలే
విరితేనెలు తొణికెనులే
నా పేరుతో చేరే పేరే నే చెప్పనా॥॥ప్రతిరోజు॥