Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

okka kshaNam(swarAbhishEkam) - ఒక్క క్షణం(స్వరాభిషేకం)

చిత్రం : స్వరాభిషేకం(swarAbhishEkam) (2004)
రచన : వేటూరి సుందరరామమూర్తి(vETUri sundararAmamUrthy)
సంగీతం : విద్యాసాగర్(vidyAsAgar)
గానం : ఎస్.పి.బాలు, శైలజ(S.P.bAlu,Sailaja)
02 March - నేడు విద్యాసాగర్ బర్త్‌డే


సాకీ :
ఒక్క క్షణం...
ఒక్క క్షణం...
గరిమల
నీ మురిపెపు ముద్దుల మొలకొచ్చేదిక
ఒక్క క్షణం...
ఒక్క క్షణం...
పల్లవి : అమ్మకడుపు చల్లగా
అయ్యకలలు పండగా
ఇమ్మనరే... ఇమ్మనరే దేవతల
ఈ తల్లికి వరము
ఈ లాలికి స్వరము ఇహము పరము॥
చరణం : 1
కౌసల్యకు తప్పని
అమ్మవేదన మన రామకీర్తన
రామం దశరథ రామం
దనుజ విరామం ధరణిజ సోమం॥
దేవకికే తప్పని చెరసాల వేదన
నవరసాల నర్తన
నంద నందనం భక్త చందనం
గోపికా గోవందనం॥
గగప రిరిగ సాదసా
సరిగరి పదపాగరి
గప దపాదపా సదా గసరి సారి గరీ
గగ రిరి సస రిరి సస దద సదాపగారిసారిగా
తూరుపు తల్లికి తప్పదు
ఉదయవేదన
మేఘాలకు తప్పదు
మెరుపు వేదన
ఒక్క క్షణం... ఒక్క...॥॥
చరణం : 2
కల్లోలపు కడలి మీద
తాను తేలగా వటపత్రశాయిగా
తొమ్మిది మాసాల యోగి
కెవ్వుకెవ్వున తొలికేక పెట్టగా
శోకంలో పుట్టెనంట రామాయణము
శోకంలో పుట్టెనంట రామాయణము
శ్లోకంగా పెరుగునంట
జన్మల ఋణము
ఆ ఋణానుబంధమే
ఈ శిశు జననం ॥
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద
రామగోవిందా జోజో...
Listen Audio:
okka kshaNam(swarAbhishEkam) - ఒక్క క్షణం(స్వరాభిషేకం)

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |