చిత్రం : రాజన్న(rAjanna) (2011)
రచన : కె.శివదత్త(K.Sivadatta)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.kIravANi)
గానం : సంజీవ్ చిమ్మల్గి(sanjIv chimmalli)
హమ్మింగ్స్ : కాల భైరవ(kAlabhairava)
పల్లవి :
గిజిగాడు తన గూడు
వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదని
కొలనీలో కమలాలు
తలదించుకున్నాయి
పొద్దు పొడవలేదనీని॥
గారాల మల్లమ్మ కళ్లే తెరవకుంది
తెలవారలేదే అని
నువ్వైనా చెప్పన్నా సూరీడుకి రాజన్న
ఎండక్కే లేలెమ్మని
కొండెక్కి తన ఏడు గుర్రాల బండెక్కి
పండక్కి రారమ్మని
బతుకమ్మ పండక్కి రారమ్మని
పండక్కి రారమ్మని
బతుకమ్మ పండక్కి రారమ్మని
చరణం :
నడిమింట సూరీడు నిప్పులు
చెరిగేడు పసికందు పడుకుందని ॥
నువ్వైనా చెప్పన్న సూరీడుకి రాజన్న
మబ్బు చాటుకు పొమ్మని
నా బిడ్డకి రవ్వంత నీడమ్మని
కంటికి రెప్పల్లె కాచుకున్నా గాని
నీవైపే నా తల్లి చూపు
నువ్వన్న చెప్పన్న మల్లమ్మకి రాజన్న
ఇలుదాటి పోవొద్దని
దయచేసి నీ దరికి రావద్దని (2)
Special Note:
కె.శివశక్తిదత్త, సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తండ్రి. దర్శకునిగా విజేయేంద్రప్రసాద్‌తో కలిసి ‘అర్ధాంగి’ (1996), స్వీయ దర్శకత్వంలో ‘చంద్రహాస్’ (2007) సినిమాను తీశారు. ఆయన రాసిన పాటలు తక్కువైనా అవి ఎంతో ప్రజాదరణ పొందాయి.