ammAyi muddu - అమ్మాయి ముద్దు
చిత్రం : క్షణ క్షణం(kshaNa kshaNam) (1991)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : ఎం.ఎం. కీరవాణి(M.M.keeravANi)
గానం : ఎస్.పి.బాలు, చిత్ర(S.P.bAlu,chitra)
పల్లవి :
తానా నానానాన
తనానానాననానానాన
తానా నానానాన త త త
' తానా నానానాన'
అమ్మాయి ముద్దు ఇవ్వందే...
ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే
అమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమ్మంది బుగ్గ వద్దంటూ
అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా
ముద్దిమంటే బుగ్గ అగ్గల్లె వస్తే
ఆగేదెట్టా హద్దు పొద్దు వద్దా
చరణం : 1
మోజు లేదనకు ఉందనుకో
ఇందరిలో ఎలా మనకు
మోగి పొమ్మనకు చీకటిలో
ఇద్దరమే ఉన్నామనుకో
చూడదా... హా సహించని
వెన్నెల హా హా హా...
దహించిన కన్నుల
కళ్లు మూసేసుకో హాయిగా
' తానా నానానాన'
చరణం : 2
పారిపోను కదా అది సరే అసలు కథ
అవ్వాలి కదా
ఏది ఆ సరదా అన్నిటికీ
సిద్ధపడే వచ్చాను కదా
అందుకే అటూ ఇటూ చూడకు
సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు
' తానా నానానాన'
Special Note:
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఏకైక సినిమా ‘క్షణ క్షణం’ వెంకటేష్ సరసన శ్రీదేవి నటించిన ఏకైక సినిమా కూడా ఇదే. 1986లో ‘కలియుగ పాండవులు’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన వెంకటేష్‌కు ‘క్షణక్షణం’ 21వ సినిమా. ఆయన హీరోగా ఇప్పటి వరకు 65 సినిమాలలో నటించారు.
Another Link:
ammAyi muddu