cheppindi chEyabOkurA - చెప్పింది చేయబోకురా
చిత్రం : హరిశ్చంద్ర(hariSchandra) (1956)రచన : కొసరాజు(kosarAju)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి(susarla dakshiNAmUrti)
గానం : స్వర్ణలత(swarNalata)
పల్లవి : చెప్పింది చేయబోకురా
నా సామిరంగ చేసేది తెలియనీకురా
'చెప్పింది'
చరణం : 1
కాళ్లు జారి పడ్డవోణ్ణి లేవదీయడెవ్వడు (2)
పైకి లేచి వచ్చినోడు పల్లకీని మోస్తరు
'చెప్పింది'
చరణం : 2 నిన్ను నువ్వు నమ్ముకుంటే
నీకు సాటిలేరురా
సాటిలేరురా సాటిలేరురా... ॥
పరుల కాళ్ల మీద నువ్వు పరుగులెత్తలేవురా
'చెప్పింది'
చరణం : 3
నమ్మరాని వాణ్ణి నువ్వు నమ్మితే మోసము నమ్మరాని వాణ్ణి నువ్వు నమ్మితే మోసము
నమ్మదగ్గ వాణ్ణి నువ్వు
నమ్మకుంటే దోషము
లోకులు కాకులు తోకలేని కోతులు (2)
గాలిపటం తిరిగినట్లు
వాలిపోవుచుందురూ ॥
Special Note:
అసలు పేరు : మహాలక్ష్మి
జననం : 10-03-1928
జన్మస్థలం : చాలగమర్రి
గ్రామం, కర్నూలు.
తల్లిదండ్రులు : లక్ష్మీదేవి, రామసుబ్బన్న
తోబుట్టువులు : ఐదుగురు చెల్లెళ్లు,
ఇద్దరు తమ్ముళ్లు
చదువు : ఎస్.ఎస్.ఎల్.సి.
గురువులు : ఫిడేలు సుబ్బన్న (8 ఏళ్లు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ), శాస్త్రి (కొంతకాలం నాట్యంలో శిక్షణ), కమల్ (ఇతని ప్రోత్సాహంతో నాటకాలలో నటిగా, గాయనిగా)
వివాహం : 22-05-1956
భర్త : డా. మెడతాటి అమరనాథ్ (సివిల్ సర్జన్)పిల్లలు : ఆరుగురు కుమారులు - ఆనందరాజ్ (ప్రముఖ విలన్), డా.అమృతరాజ్, డా.అర్లరాజు, డా.శేఖర్, డా.రమేష్, నటరాజ్ (అనిల్ రాజ్ - డాన్స్ మాస్టర్), ముగ్గురు కుమార్తెలు - మరియమ్మ (చాముండేశ్వరీదేవి), డా.ఎస్టేర్ రాణి, గాయని కీ.శే. స్వర్ణలత.
తొలిచిత్రం-పాట : పరమానందయ్య శిష్యులు (1950) (మొదటి అవకాశం), మాయారంభ
(1950)లో కస్తూరి శివరావుతో ‘రాత్రనక పగలనక’ అనే పాట (మొదట రిలీజ్ అయింది).
ఆఖరిచిత్రం-పాట : అత్తలూ - కోడళ్లు (1971), భలే భలే బావయ్య... అనే పాట బాలుతో
పాటలు : దాదాపు ఐదు వేలు (తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, సింహళ, హిందీ భాషలలో దాదాపు 600 చిత్రాలు)
నటించిన సినిమాలు : కీలుగుర్రం (1949), పరమానందయ్య శిష్యులు (1950), అగ్ని పరీక్ష (1951), మరొక రెండు సినిమాలు.
అవార్డులు : సినిమాలకు సంబంధించి ఉత్తమ గాయకురాలిగా ఐదు అవార్డులు
ఇతరవిషయాలు : మొదటగా హెచ్.ఎమ్.వి. కంపెనీలో పాడారు. ఆలిండియా రేడియోలో ఎన్నో లలిత గీతాలు పాడారు. గాయకులైన మాధవపెద్ది సత్యం, పిఠాపురంతో కలిసి చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశారు. ఈ మధ్యే కుమారుడైన అనిల్ రాజ్ ‘ఆడ నేను... ఈడ నీవు’ అనే 50 పాటల సంకలనం గల సీడీని విడుదల చేశారు. ఆమె పేరు మీద రెండు అనాథ ఆశ్రమాలు (వివరాలకు 9908051020) నడుస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం 1974 లో ‘దళపతి’ బిరుదుతో సత్కరించింది. హాస్యగీతాల స్పెషలిస్టుగా ‘మధురాతి మధురం స్వర్ణలత స్వరం’. మరణం : 10-03-1997