chinnAri chUpulaku - చిన్నారి చూపులకు
చిత్రం : అప్పు చేసి పప్పుకూడు(appu chEsi pappu kUDu) (1959)రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఎ.ఎం.రాజా
పల్లవి :
చిన్నారి చూపులకు ఓ చందమామా
ఎన్నెన్నో అర్థాలు ఓ చందమామ...
నా చందమామ... ॥
చరణం : 1
తలుపు చాటున దాగి ఓరచూపులు చూస్తే
పిలిచినట్టె వెళ్లి పలకరించాలంట॥
తప్పించుకొని పోయి జాలిగా చూస్తేను
తప్పించుకొని పోయి జాలిగా చూస్తేను
వలచినట్టే ఎంచి మురిసిపోవాలంట॥
చరణం : 2
కనుబొమలు చిట్లించి కోరచూపులు చూస్తే
తననింక విడువనని బాస చేయాలంట॥
కొంగు సవరించుకొని కొరకొరా చూస్తేను
కొంగు సవరించుకొని కొరకొరా చూస్తేను
చెంగు వీడనటంచు చెంత చేరాలంట॥
Special Note:
పూర్తిపేరు : ఏముల మన్మథరాజా
జననం : 19-11-1929
జన్మస్థలం : చిత్తూరులోని రామాపురం
తల్లిదండ్రులు : లక్ష్మమ్మ, మన్మథరాజు
తోబుట్టువులు : అక్క (కీ.శే. నాగమ్మ)
చదువు : బి.ఎ.
వివాహం : 26-06-1958
భార్య : గాయని జిక్కి (అసలు పేరు కృష్ణవేణి)
సంతానం : ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు
గాయకునిగా... తొలిపాట-చిత్రం : సంసారం సంసారం సంసారం సకల ధర్మసారం సుఖ
జీవన ఆధారం (సంసారం, 1951, తమిళం) శుభోదయం (తెలుగు)
ఆఖరి చిత్రం : మంచిని పెంచాలి (1980)
పాటలు : దాదాపు పదివేలు (తెలుగు, తమిళ , మలయాళ, కన్నడ, హిందీ, సింహళ భాషలలో)
సంగీత దర్శకునిగా...
తొలి చిత్రం : శోభ (1958, తెలుగు) కల్యాణపరిసు (1959, తమిళంలో)
ఆఖరి చిత్రం : మంచిని పెంచాలి (1980)
చిత్రాలు : దాదాపు 25 (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం)
నటించిన సినిమా : పక్కయింటి అమ్మాయి
గౌరవపురస్కారాలు : తమిళనాడు నుండి ‘కళైమామణి, తమిళనాడు ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ నుండి కల్యాణపరసుకు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు, తెలుగు ఉగాది పురస్కారం.
ఇతరవిషయాలు : చిన్నప్పటి నుండి సంగీతం పట్ల అభిరుచి ఉండటం వల్ల రాజాకు ఆయన తండ్రి ఐదేళ్లు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. బి.ఎ. చదువుతున్నప్పుడు ఒక సంగీత పోటీలో రాజా మొదటి బహుమతి గెలుచుకోవడంతో, ఆయన పేరు హెచ్.యం.వి. గ్రామ్‌ఫోన్ కంపెనీ వాళ్లకు తెలిసింది. వాళ్లు ‘ఎంత దూర మీ పయనం’ అనే పాటను రాజాతో పాడించి ‘రికార్డు’గా విడుదల చేశారు. ఇదే రాజా మొదటి గ్రామ్‌ఫోన్ రికార్డు. దక్షిణ భారతదేశం నుండి సింహళ భాషలో పాడిన మొదటి వ్యక్తిగా, తెలుగు, తమిళంలో తీసిన ‘ప్రేమలేఖలు’ చిత్రానికి దక్షిణ భారతదేశం నుండి బొంబాయికి వెళ్లి పాడిన మొదటివ్యక్తిగా రాజాకే ఆ గౌరవం దక్కింది.
మరణం : 08-04-1989.