Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

గానం : శ్వేతా పండిట్

చిత్రం : పంజా (panjA)(2011)
రచన : చంద్రబోస్
సంగీతం : యువన్‌శంకర్‌రాజా

ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళ చూపేదెలా
ఎడారిలో గోదారిలా
నాలో అల ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా
జన్మ మరల...॥ఎలా॥
చరణం :
నిన్నలోని నిమిషమైనా
గురుతురాదే ఈ క్షణం
నీటిలోని సంబరాన
ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా...
నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలనీ
నూరేళ్ల పయనాలు చేయాలనీ
ఈ పరవశంలోన నిలిచా
ప్రాణశిలలా ॥ఎలా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |