Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

pADavEla rAdhikA - పాడవేల రాధికా

చిత్రం : ఇద్దరు మిత్రులు(iddaru mitrulu) (1961)
రచన : శ్రీశ్రీ(SrI Sri)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు(sAlUri rAjEswararAo)
గానం : పి.సుశీల, ఘంటసాల(P.suseela,ghanTasAla)
30 April - నేడు శ్రీశ్రీ జయంతి


పల్లవి : ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ...
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక (2)
॥ పాడవేల ॥
చరణం : 1
ఈ వసంత యామినిలో... ఓ...
ఈ వెన్నెల వెలుగులలో... ఓ...
॥ ఈ వసంత॥
జీవితమే పులకించగ...
జీవితమే పులకించగ నీ వీణను సవరించి
పాడవేల రాధికా...
చరణం : 2 గోపాలుడు నిను వలచి
నీ పాటను మది తలచి (2)
ఏ మూలనో పొంచి పొంచి...
ఏ మూలనో పొంచి పొంచి
వినుచున్నాడని యెంచి
పాడవేల రాధికా...
చరణం : 3 వేణుగానలోలుడు
నీ వీణామృదురవము వినీ (2)
ప్రియమారగ నినుచేరగ
దయచేసెడి శుభవేళ
॥ పాడవేల ॥

Special Note:
పూర్తిపేరు :
శ్రీరంగం శ్రీనివాసరావు
జననం : 30-04-1910
జన్మస్థలం : విశాఖపట్టణం
తల్లిదండ్రులు : అప్పన్నకొండ,
వెంకటరమణయ్య
చదువు : బి.ఏ.
వివాహం-భార్య :
1925-వెంకటరమణమ్మ
1956-యు.సరోజ

పిల్లలు : దత్తపుత్రిక (లెనీనా), ముగ్గురు కుమార్తెలు (మంజుల, మంగళ, మాల),
ఒక కుమారుడు (రమణ)
తొలి డబ్బింగ్ చిత్రం-పాట : ఆహుతి (1950) - ప్రేమయే జనన మరణ లీల
ఆఖరిచిత్రం : దాహం దాహం (1982)
తెలుగులో నేరుగా తొలిచిత్రం : నిర్దోషి (1951)
ఆఖరిచిత్రం-పాట : నేటి భారతం (1983) - అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం

పాటలు : నేరుగా తెలుగులో దాదాపు 500, డబ్బింగ్ పాటలు 800, మొత్తం 1300 అని ఒక అంచనా. లభించినంత వరకు నేరుగా తెలుగులో 400, డబ్బింగ్ పాటలు 500.
అవార్డులు : అల్లూరి సీతారామరాజు (1974) లో ‘తెలుగువీర లేవరా... దీక్షబూని సాగరా’ అనే పాటకు జాతీయ అవార్డు, 1979లో రాజాలక్ష్మీ పౌండేషన్ అవార్డు, నేటిభారతం (1983)లో ‘అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం’ పాటకు నందిఅవార్డు అందుకున్నారు.

ఇతరవిషయాలు : 10 ఏళ్ల వయసు నుండే నవలలు రాయడం మొదలుపెట్టారు శ్రీశ్రీ. మద్రాస్‌లో బి.ఏ. పూర్తి చేశారు. ఆ తర్వాత విశాఖ హార్బర్‌లో మిసెస్ ఏవీయన్ కాలేజీలో జంతుశాస్త్ర విభాగంలో డిమాన్‌స్ట్రేటర్‌గా ఆంధ్రప్రభ ఉపసంపాదకునిగా మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో విశాఖలో ‘నటాలి’ స్వచ్ఛంద సంస్థలో రచయితగా హైదరాబాద్ నిజాం రిఫరం సెక్రటేరియట్‌లో పౌరసంబంధ ఉద్యోగిగా ఆనందవాణి సాహిత్య పత్రికకు సంపాదికునిగా... ఎన్నో ఉద్యోగాలు చేశారు శ్రీశ్రీ. డబ్బింగ్ చిత్రాల రచన ‘శ్రీశ్రీ’ తోనే ఆరంభమైంది. 1940లో శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’, ఇతర గీతాలు సిద్ధమయ్యాయి. అవి 1950 నాటికి పుస్తకరూపం దాల్చాయి.
మరణం : 05-06-1983

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |