దేవుడు చేసిన మనుషుల్లారా
చిత్రం : దేవుడు చేసిన మనుషులు(dEvuDu chEsina manushulu) (1973)రచన : శ్రీశ్రీ(SrISrI)
సంగీతం : రమేష్‌నాయుడు(ramesh naidu)
గానం : ఘంటసాల, బృందం(ghanTasAla,group)
పల్లవి:
దేవుడు చేసిన మనుషుల్లారా
మనుషులు చేసిన దేవుళ్లారా
వినండి మనుషుల గోల
కనండి దేవుడి లీల
//వినండి// //దేవుడు//
గోవిందా హరిగోవిందా
గోవిందా భజగోవిందా
గోవింద గోవింద హరిగోవిందా
గోవింద గోవింద భజగోవిందా
//గోవింద//
చరణం : 1 వెన్న దొంగ... ఆ...
వెన్న దొంగ మా తొలిగురువు
తొలి నుంచీ మా కులగురువు
కోరిన కోరిక తీరాలంటే
కోరక మోక్షం రావాలంటే
గోపాలుని సేవించాలి
గోవిందునే ధ్యానించాలి
//గోవింద//
వినండి దేవుల గోల
కనండి మనుషుల లీల
//వినండి// //దేవుడు// //వినండి//
చరణం : 2
పేదల నెత్తురు తాల్చిన రూపం
బలిసిన జలగలు దాచిన పాపం //పేదల//
మానవులను పీడించే జబ్బు
దేవతలను
ఆడించే డబ్బు //మానవులను//
తెలుపో నలుపో
జానేదేవ్
ఆ తేడాలిక్కడ లేనేలేవ్
//తెలుపో//
లేనేలేవ్...
వినండి డబ్బుల గోల
కనండి మనుషుల లీల //వినండి//
చరణం : 3
గాలిబుడగ జీవితం
ఓటి పడవ యవ్వనం //గాలి//
నిన్న మరల రాదు రాదు రాదు
నేడే నిజం నేడే నిజం నేడే నిజం...
రేపు మనది కాదు కాదు
నేడే సుఖం నేడే సుఖం
సుఖం సుఖం నేడే సుఖం
కాసే బ్రహ్మానందం... అహ
ఓ... డోసే పరమానందం... ఓహో //కాసే//
ఆనందం పరమానందం
ఆనందం బ్రహ్మానందం// ఆనందం//
వినండి గ్లాసుల గోల
కనండి మనుషుల లీల
//వినండి// //దేవుడు// //వినండి//
రామ్... రామ్ రామ్ రామ్
చరణం : 4
ఆలయాలలో
వెలుతురు లేదు
ఆకాశంలో చీకటి లేదు
//ఆలయాలలో//
విమానాలలో విహరిస్తుంటే
సముద్రాలనే దాటేస్తుంటే
//విమానాలలో//
గుడిలో ఎందుకు రామయ్యా
విడుదల చేస్తాం రావయ్యా
నిను విడుదల చేస్తాం రావయ్యా//గుడిలో//
రామయ్యా... రావయ్యా... (2)
రామయ్యా! లేవయ్యా! //రామయ్యా//
లేవయ్యా! లేవయ్యా! (2)
External Link:
dEvuDu chEsina - దేవుడు చేసిన మనుషుల్లారా