Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

peLli AhAhA peLli - పెళ్లీ ఆహాహా పెళ్లి

చిత్రం : సంఘం(sangham) (1954)
రచన : తోలేటి(tOlETi)
సంగీతం : ఆర్.సుదర్శనం(R.sudarSanam)
గానం : పిఠాపురం నాగేశ్వరరావు(piThApuram nAgEswararRo)

27 April - నేడు ఆర్.సుదర్శన్ జయంతి
Listen song:


పల్లవి :
పెళ్లీ... పెళ్లి పెళ్లి పెళ్లీ...
ఈడైనా దానితో
జోడీగా హాయిగా (2)
ఈ లోకమందు
సౌఖ్యాల పొంది
ఆనందమొందగా
పెళ్లీ... భలే
మజా పెళ్లి... ఆహాహా పెళ్లి...
చరణం : 1
పందిళ్ల కింద విందులు చేసే
అత్తిల్లే స్వర్గం ఆనందమార్గం
భూలోక స్వర్గం ఆనందమార్గం
'పందిళ్ల '
అమ్మాయికి అబ్బాయి
అమ్మాయికి అబ్బాయి (2)
చేరిన సంసార జీవితం భలే భలే..
చేరిన సంసార జీవితంలో
సంఘంలో పూజితం
'లోకమందు'
పెళ్లీ... ఛంఛంఛం పెళ్లి
డుండుండుం పెళ్లి
ప్రేమకి జాతి కీర్తి నీతి రీతి
లేదయ్యోయ్
తెలుపు నలుపు లేదయ్యోయ్
హే... మూడుముళ్ల
వెయ్యయ్యోయ్
పెళ్లీ... జిల్ జిల్ జిల్ పెళ్లి
టకటకటక పెళ్లి
చరణం : 2
దేవుడు నన్నే చల్లగ చూస్తే
అప్పుడే నాకు అవుతుంది పెళ్లి
నాకూ అవుతుంది పెళ్లి
'దేవుడు'
సరోజ గిరిజ వనజ జలజ
మాలతి మాధ వి మల్లిక మోహిని
ఎవతో ఓ భామిని ఆమే నీ కామిని
పట్నం పిల్లో పల్లెటూరి పిల్లో
చిక్కిన రాజా చక్కిరకొట్టు
జణక్కు తకథిమి జణక్కు తకథిమి
టకుటికుటికుటకు డుండుం
వైవాహ కంకణం ప్రాప్తి బంధనం
దైవ నిర్ణయం (2)
పెళ్లి... తళుక్కు జనపెళ్లి
తదిగిణతోం పెళ్లీ...
'ఈడైనా'
పెళ్లీ... ఆహాహా పెళ్లి వారెవా పెళ్లి...

External Link:

peLli AhAhA peLli - పెళ్లీ ఆహాహా పెళ్లి
sangham all songs

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |