పల్లవి : వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా...
వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
లేనేలేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా...
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్...
పుట్టుమచ్చే చూడనా
తొలిముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా
మరి ముట్టుకుంటే కందనా
మందార బుగ్గల్లో
ప్రేమంతా చెప్పిందే... ఓయ్
॥వాలే॥
చరణం : 1
ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే
॥
ఎన్ని బంధాలో ఎన్నెన్ని బంధాలే
గుండెకేసి హత్తుకుంటే
అలలా ఉందిలే
ఇన్నాళ్లు ఈ ప్రేమంతా ఏమైందిలే
ఇవ్వాళే చెప్పేశావు
ఎట్టా ఎట్టా ఎట్టెట్టా...
॥వాలే॥
చరణం : 2
ఒంపు సొంపుల్తో ఈ ఒంటి బాధల్తో
చీరంచే నవ్వేస్తుంటే సిగ్గౌతుందిలే
॥సొంపుల్తో॥
కంటి సైగల్తో నీ కొంటె చేష్టల్తో
కవ్వించి రమ్మంటుంటే
మతి పోతుందిలే
ఎన్నాళ్లు మోయాలయ్యో
పొంగే పొంగులే
నీ సాయం కావాలయ్యో
ఎట్టా ఎట్టా ఎట్టెట్టా...
॥వాలే॥
చిత్రం : వాసు (2002)
రచన : పోతుల రవికిరణ్
సంగీతం : హారిస్ జయరాజ్
గానం : బాలు, చిత్ర, కార్తీక్