Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

madanA manasAyerA - మదనా మనసాయెరా

చిత్రం : పూజాఫలం (pUjAphalam)(1964)
రచన : డా॥సి.నారాయణరెడ్డి(Dr C.nArAyaNareddy)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు(sAlUri rAjEswararAo)
గానం : ఎస్.జానకి(S.jAnaki)
23 April - నేడు ఎస్.జానకి పుట్టినరోజు

పల్లవి : ఓ ఓ ఓ... మదనా మనసాయెరా
పరువము పొంగే తరుణము నేడే
మరి మరి నీకై రాబోదురా
మదనా మనసాయెరా
చరణం :
ఆ... సుందరి మధువై ముందు నిలిచెరా
నీ ముందు నిలిచెరా... ఆ...
అందిన పెన్నిధి అనుభవించరా... ఆ...
కలువును మీరే చెలువును చేరే (2)
వలపులు తూచే వేళయెరా॥


O..O..O..madanA manasAyerA
paruvamu pongE taruNamu nEDE
mari mari nIkai rAbOdurA
madanA manasAyerA

A..A.. sundari madhuvai mundu nilicerA
nI.. mundu nilicerA..A..
andina pennidhi anubhavincarA..A..
kaluvanu mIrE celuvanu cEre
kaluvanu mIrE celuvanu cEre
valapunu tUcE vELayerA

madanA manasAyerA
paruvamu pongE taruNamu nEDE
mari mari nIkai rAbOdurA
madanA manasAyerA




పూర్తిపేరు : శిష్ట్లా జానకి
జననం : 23-04-1938
జన్మస్థలం : గుంటూరు జిల్లా రేపల్లె తాలుకా
పల్లపట్ల గ్రామం
తల్లిదండ్రులు : సత్యవతి, శ్రీరామమూర్తి
తోబుట్టువులు: అక్కలు (కృష్ణవేణి, వరలక్ష్మి, రాధ), చెల్లెళ్లు (సరోజ, శారద) (ఇద్దరు అక్కల
తర్వాత అక్క, ఇద్దరన్నలు పుట్టి చనిపోయారు)
వివాహం-భర్త : 09-12-1959, రాంప్రసాద్
పిల్లలు : మురళీకృష్ణ (గిటారిస్టు, గాయకుడు, ఆడియో క్యాసెట్ల నిర్మాత)
కోడలు-మనవలు : ఉమ (కూచిపూడి, భరతనాట్య నర్తకి)-అమృత వర్షిణి, అప్సర
తొలిచిత్రం-పాట : ‘విదియిన్ విళైయాట్టు’ (తమిళం) లో ‘పేదై ఎన్నాసి పాలాన దేనో’ అనే పాట, మరొకపాట (04-04-1957 మొదటిపాట రికార్డు అయింది. ఈ సినిమా ఇప్పటికీ రిలీజు కాలేదు). తమిళంలో ‘కణక్కు నేరే మిన్నిడుంతారై’ అనే యుగళగీతం పి.బి.శ్రీనివాస్‌తో మొదటిదని చెప్పుకోవాలి. తెలుగులో ఎం.ఎల్.ఎ. లో ‘నీ ఆశ అడియాస’ ఘంటసాలతో...
పాటలు : 22 వేలకు పైగా (17 భాషలలో)
ప్రైవేటు గీతాలు : 15 వేలకు పైగా
సంగీత దర్శకురాలిగా:మౌనపోరాటం (1989)
డ బ్బింగ్ చెప్పిన చిత్రాలు : చందమామ రావే (1987), జడ్జిమెంట్ (1990) (ఈ రెండు చిత్రాల్లో బేబీ సుజితకు డబ్బింగ్ చెప్పారు)
పురస్కారాలు-గౌరవాలు : ఉత్తమ గాయనిగా తెలుగులో 10 నంది అవార్డులు, తమిళంలో 7, ఒరియాలో 1, మలయాళంలో 13. జాతీయ ఉత్తమగాయనిగా... తమిళం-2, తెలుగు-1, మలయాళం-1. మైసూర్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్. కళైమామణి అవార్డు, లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డులు, మరెన్నో సంగీత అవార్డులు అందుకున్నారు.
ఇతర విషయాలు : చిన్నప్పటి నుండే స్వరాలు రాసేవారు. పాటలు పాడేవారు. ఒక్క పాటే కాదు ఆటల్లో కూడా ముందుండేవారు. 10 ఏళ్ల వయసులో రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి దగ్గర కొన్ని కీర్తనలు, తర్వాత కొవ్వూరులో వారణాసి బలరామయ్య దగ్గర ఒకటి రెండు కీర్తనలు నేర్చుకున్నారు. లతామంగేష్కర్ పాటలను ఎక్కువుగా విని, పాడేవారు. లతా గొంతే జానకికి గురువు. ఆలిండియా రేడియో తరపున ఢిల్లీలో మొదటి అవార్డు అందుకున్నారు. జానకి 1957లో ఏవీఎమ్ సంస్థకు స్టాఫ్ సింగర్‌గా సెలక్టయ్యారు. అక్కడ నుండి ప్రారంభమైన గాత్ర ప్రస్థానం నేటికీ కొనసాగుతూనే ఉంది. స్వీయ సంగీత దర్శకత్వంలో ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్‌కి పాడారు. బొమ్మలు గీయడం, బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు రంగులు వేయడం ఆమె హాబీలు. తెలుగులో చివరిగా ప్రస్తుతానికి ‘నీ సుఖమే నే కోరుతున్నా (2008)’ లో ‘అమ్మాయే పుట్టిందమ్మా’ అనే పాట బాలుతో ఆలపించారు. ఈ మధ్యనే ‘వెళ్లై కాగితం’ (ఇంకా రిలీజు కాలేదు) లో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ పాడారు.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |