ADakUturA nIku - ఆడకూతురా నీకు
చిత్రం : కంటే కూతుర్నే కను(ka~mTE kUturnE kanu) (1998)రచన : సుద్దాల అశోక్‌తేజ(suddAla ashok tEja)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్(vandEmAtaram SrInivAs)
గానం : కె.ఎస్.చిత్ర(K.S.chitra)
పల్లవి :
ఆడకూతురా నీకు
అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న
నీవు రక్తచందనం
//ఆడకూతురా//
చరణం : 1
మహరాజులే
మగాళ్లు అందరు
తెల్లవారినా నిదుర లేవరు
కంటినిండ కునుకు
కనలేదు నీవెప్పుడు
సగము నిదురలోనే
నినులేపేను చీపురు
మగబిడ్డల యోగమేమిటో
లేవగానే భోగ మేమిటో
ఎగతాళిగ నిన్నేగని
నవ్వే పాచి గిన్నెలు
ఆడకూతురా
నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న
నీవు రక్తచందనం
చరణం : 2
బండచాకిరి రేబవలు చేసినా
గుండె బరువని నీ పేరు పెట్టిరి
పదహారవ ఏట ఇక మొదలు
వరుడి వేట
నీ బరువు దించుకోవడమే
తల్లిదండ్రి ముచ్చట
పుటక నుండి చావు మధ్యనా
బతుకునంత అరగదీసినా
ఏ జీతము ఏ సెలవు
ఎరుగని ఒక దాసివి
//ఆడకూతురా//
చరణం : 3
పెళ్లిపీటపై కంఠాన్ని ముడేసి
నాతిచరామి అంటాడు ఒట్టేసి
అక్షింతలతోనే మంత్రాలు నేలపాలు
మరునాటి నుండే నీ బతుకు
బూటు కాలు
ఇంటికి దీపం ఇల్లాలు
అత్తమామ కాదంటే చీకటి పాలు
మగవాడే నీనొసటన రాసే
మనువు రాతలు
//ఆడకూతురా//