పల్లవి :
ఎంతా టక్కరివాడు నా రాజు
ఏ మూలనో నక్కినాడు
పంటచేను గట్టుమీద
ఒంటిగ నే పోతుంటే
వెంట వచ్చినట్టులున్నది
ఎవరో వెనక నిలిచినట్టులున్నది (2)
గుబులు గుబులుగా గుండె ఝల్లుమని గుబులు గుబులుగా గుండె ఝల్లుమని
బిక్కు బిక్కుమని చూశాను
ఫక్కున పక్కనే నవ్వేను
ఎవరూ... నా నీడ ॥
చరణం : 1
పొర్లిపారు ఏటిలోన
బుటుకు బుటుకు మునుగుతుంటే
బుగ్గ తాకినట్టులున్నది
ఎవరో పైట లాగినట్టులున్నది
గిలిగింతలు పెట్టినట్లు
ఒడలంతా పులకరించే
నీళ్లంతా వెదికినాను
త్రుళ్లి త్రుళ్లి పారిపోయేనూ
ఎవరూ చేప... ॥
చరణం : 2
అర్ధరాత్రి వేళ నేను ఆదమరచి నిదురపోతే
వద్ద చేరినట్టులున్నది
ఎవరో ముద్దులాడినట్టులున్నది
చిక్కినాడూ దొంగయనుకొని
చేయి చాచి పట్టబోతే
కంటికేమి కానరాక
కరిగి కరిగి పోయెను
ఎవరూ... కల... ॥
చిత్రం : వుంచివునసులు (1962)
రచన : కొసరాజు
సంగీతం : కె.వి.వుహదేవన్
గానం : జమునారాణి
పూర్తిపేరు : కోక జమునారాణి
జననం : 17-05-1938
జన్మస్థలం : చెన్నై
తల్లిదండ్రులు: ద్రౌపది, వరదరాజుల నాయుడు
తోబుట్టువులు : అన్నయ్య కె.వి.స్వామి
చదువు : 8వ తరగతి
తొలిచిత్రం-పాట : త్యాగయ్య (1946) - మధురానగరిలో...
పాటలు : సుమారు 6 వేలు (తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, సింహళం)
గౌరవ పురస్కారాలు : తమిళనాడు ప్రభుత్వం నుండి 1998లో కళైమామణి. శ్రీలంకలో సరసవ్య ఫెస్టివల్ తరఫున 2002లో మహేంద్ర రాజపక్ష చేతుల మీదుగా ‘అరింగర్ అన్నా’ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, తెలుగులో ‘ఉగాది పురస్కారం’ అందుకున్నారు.
ఇష్టమైన వాయిద్యం : హార్మోనియం
ఇష్టమైన రాగం : శుభ పంతువరాళి
ఇతరవిషయాలు : జమునారాణి తల్లి సాంబమూర్తి ఆర్కెష్ట్రాలో వీణను వాయించేవారు. తల్లి వద్దే జమునారాణి సంగీతాన్ని నేర్చుకున్నారు. 4 ఏళ్ల వయసప్పుడు రైల్వే చిల్డ్రన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొని ఒక తమిళ సినిమా పాట పాడి మొదటి బహుమతి గెలుచుకున్నారు. మొదట జమునారాణి ‘తాసీల్దారు (1944)’ అనే సినిమాలో పాడారు. కానీ రికార్డులలో ఆవిడ పేరు వేయలేదు.
ఈమెను సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి ఎక్కువగా ప్రోత్సహించేవారు. 50వ దశకంలో తెలుగులో మాత్రమే ఐదు ప్రైవేటు గీతాలు పాడారు. ఇటీవల ‘మిథునం’ (రిలీజ్ కాలేదు) అనే సినిమాలో ‘ఎవరో గెలిచారిప్పుడు...’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌ను పాడారు.