kalagaNTi kalagaNTi - కలగంటి కలగంటి
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర(S.P.bAlu.chitra)చిత్రం : అన్నమయ్య (annamayya)(1997)
రచన : అన్నమాచార్య(annamAchArya)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(m.M.kIravANi)
పల్లవి :
కలగంటి కలగంటి... ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి॥
చరణం : 1
అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి
చతురాశ్యు పొడగంటి...
చతురాశ్యు పొడగంటి చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి...
చరణం : 2
అరుదైన శంఖచక్రాదులిరుగడ గంటి
సరిలేని అభయ హస్తమును గంటి
తిరువేంకటాచలాధిపుని చూడగ కంటి
హరి గంటి గురుగంటి...
హరి గంటి గురుగంటి అంతట మేలుకంటి
mUsina mutyAlakElE - మూసిన ముత్యాలకేలే
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంపల్లవి :
మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు॥
చరణం : 1
కందులేని మోమునకేలే... కస్తూరి...
చిందు నీ కొప్పున కేలే... చేమంతులు...
గమపప పపప నిపమ గసని
సగమమ మమమ గపద మపని దనిస
మందయానమునకేలే మెట్టెలమోతలు మందయానమునకేలే మెట్టెలమోతలు
గంధమేలే పై కమ్మని నీ మేనికి॥
చరణం : 2
ముద్దు ముద్దు మాటలకేలే...
ముదములు...
నీ అద్దపు చెక్కిలికేలే... అరవిరి...
ఒద్దిక కూటమికేలే... ఏలే ఏలే ఏలేలే
ఒద్దిక కూటమికే ఊర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశుగూడి॥