maNDapETa malakpETa - మండపేట మలకపేట
చిత్రం : ప్రేమికుడు (1995)రచన : రాజశ్రీ, సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : సురేష్ పీటర్, షాహుల్ హమీద్, కుంజురామ్మ
పల్లవి :
మండపేట మలకపేట
నాయుడుపేట బేటరాప్
నేడేంటి రేపేంటి దినసరి అదే
రాత్రి ఏంటి పగలేంటి మార్పులేదులే
మర్చిపోదామే బాధలు మర్చిపోదామే
కోపం వస్తే కొంచెం ఆపుకొందామే
అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే ఛాన్స్
నీ చేతిలో అన్నీ ఉన్నవిరా
తాక్ చిక్ టపాట పాడుదాం
ముందు ఎవరు ముందు ఎవరు
ముందు ముందు ముందు ముందు
బేటరాప్ బేటరాప్... (2)
అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరిమట్ట (2)
చరణం : 1
హే... డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది
ఒక లైఫ్ చాలయ్య దేవుడా నాకు ఒక వైఫ్
తెరచి ఉంచుదాం మనసు తెరచి ఉంచుదాం
వచ్చేది ఎవరో వేచిచూద్దాం
అరే నీకోసం పుట్టింది నీదేరా
దొరికింది అందుకోరా అంతేరా
జరిగింది జరిగేది ఉంటే తెల్లవారె తెల్లవారె
తెల్ల తెల్ల తెల్లవారే
బేటరాప్ బేటరాప్... బేటరాప్ బేటరాప్... (2)
చరణం : 2
వాటర్ కరెంట్ కళ్లాపి ప్యాకెట్ పాలు
పిల్లలు స్కూలుఫీజు చక్కెర చమురు రవ్వ రేషన్
పామాయిల్ పచ్చి బియ్యం గోధుమ చాలక చాలక
ఉన్న డబ్బులన్నీ చాలక
ఒక్కణా రెండణా హుండి పగలగొట్టి
పావలా అర్ధ అప్పుసొప్పు చేసి॥
చెంబు చాట తాకట్టు పెట్టి
ఐదు పది అడుక్కున్న అవసరాలు తీరలేదే॥॥
చరణం : 3
సారాయి ఎండుచేప బీడీముక్క
పండుగప్ప గుడిసె కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు
రిక్షా గాలిపటం గాజుపెంకు మాంజా
గూటీబిళ్ల గోళికాయ గాలిపాట పాడుదాం
అగడం బగడం నెమలికి దంతం
సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమణి
ఎన్.టి.ఆర్. ఏ.ఎన్.ఆర్. చిరంజీవి బాలయ్య
పగలు గిగలు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ ఫుల్లే॥