chilipi chilaka - చిలిపి చిలక
చిత్రం : అల్లరి ప్రేమికుడు(allari prEmikuDu) (1994)రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.kIravANi)
గానం : ఎస్.పి.బాలు, చిత్ర(S.P.bAlu,chitra)
పల్లవి : చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకి
రేపో మాపో కమ్మని శోభనం॥
చరణం : 1
సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక
కలికి వయ్యారాల ఒంపు
ఆ... కబురు పంపు
ఆ... గుబులు చంపు
వంగల్లి రెక్కల్లో ఒళ్లారబోశాక
వయసు గోదాట్లోకి దింపు
ఆ... మరుల గుంపు
ఆ... మగువ తెంపు
అహో ప్రియా మహోదయా
లయ దయ లగావో
సుహాసిని సుభాషిణి
చెలీ సఖీ చలావో
ఈ వసంతాల పూల వరదలా
నను అల్లుకోవే తీగ మరదలా
నూజివీడు మామిడో
మోజు పడ్డ కాముడో
ఇచ్చాడమ్మా తీయని జీవితం॥
చరణం : 2
నీలాల మబ్బుల్లో నీళ్లోసుకున్నాక
మెరిసిందిలే చుక్క రూపు
ఆ... కలల కాపు ఆ... కనుల కైపు
పున్నాల ఎన్నెల్లో పువ్వెట్టిపోయాక
తెలిసింది పిల్లాడి ఊపు
ఆ... చిలిపి చూపు ఆ... వలపు రేపు
వరూధిని సరోజిని ఏదే కులుమనాలి
ప్రియా ప్రియా హిమాలయా
వరించుకోమనాలి
కోనసీమ కోక మడతలా
చిగురాకు ైరె కు ఎత్తిపొడుపులా
కొత్తపల్లి కొబ్బరో
కొంగుపల్లి జబ్బరో
నచ్చిందమ్మా అమ్మడి వాలకం॥