Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

నీ చరణం కమలం

చిత్రం : జానకి రాముడు (1988)
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
22 May - నేడు వేటూరి వర్థంతి


పల్లవి :
నీ చరణం కమలం మృదులం
నా హృదయం పదిలం పదిలం॥చరణం॥
నీ పాదాలే రసవేదాలు
నను కరిగించే నవనాదాలు
అవి ఎదలో ఉంచిన చాలు...
ఏడేడు జన్మాలు...॥చరణం॥
చరణం : 1
మువ్వలు పలికే మూగతనంలో
మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో
చూపున సంధ్యారాగాలు॥
అంగ అంగమున అందచందములు
ఒంపు ఒంపునా హంపి శిల్పములు॥
ఎదుటే నిలిచిన చాలు...
ఆరారు కాలాలు...॥చరణం॥
చరణం : 2
జతులే కలికే జాణతనంలో
జారే పైటల కెరటాలు
శ్రుతులే కలిసే రాగతనంలో
పల్లవించి నా పరువాలు॥
అడుగు అడుగునా రంగవల్లికలు
పెదవి అడుగునా రాగమాలికలు॥
ఎదురై నిలిచిన చాలు...
నీ మౌనగీతాలు...॥చరణం॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |