endukanO ninu - ఎందుకనో నిను
చిత్రం : సి.ఐ.డి. (C.I.D.)(1965)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, పి.సుశీల
28 May - నేడు ఎన్.టి.ఆర్ జయంతి
పల్లవి :
ఎందుకనో
నిను చూడగనే
కవ్వించాలని ఉంటుంది (2)
కవ్వించీ నీవు
కలహమాడితే
నవ్వుకొనాలని ఉంటుంది...
ఎందుకనో...
ఎందుకనో నిను చూడగనే
ఏదో ఇదిగా ఉంటుంది (2)
నీ పెదవులపై నవ్వు చిందితే
మనసు చల్లగా ఉంటుంది
ఎందుకనో... ఎందుకనో...
చరణం : 1
అడుగడుగున నీ రాజసమంతా
ఒలికిస్తూ నువు కులుకుతుంటే॥
కొంగున కట్టుకు నిను తిప్పాలని
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని
ఏదో వేడుక పుడుతుంది...
ఎందుకనో...
ఎందుకనో నిను చూడగనే
ఏదో ఇదిగా
ఉంటుంది
కవ్వించే నీవు
కలహమాడితే
నవ్వుకొనాలని
ఉంటుంది...
ఎందుకనో...
చరణం : 2
అణువణువున
నీ సొంపులు
ఒంపులు
నను మైకంలో ముంచుతు ఉంటే॥
నీలో ఐక్యం చెందాలంటూ (2)
ఏదో తహతహ పుడుతుంది... ఎందుకనో...॥
ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ...
ఆహా హో హో ఓ హో
ఓహో ఓహోహో