dil sE dilsE - దిల్ సే దిల్ సే
చిత్రం : గబ్బర్‌సింగ్(gabbarsingh) (2012)రచన : భాస్కరభట్ల
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : కార్తీక్, శ్వేతామోహన్
పల్లవి :
దిల్ సే దిల్ సే నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో
కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
తొలి తొలి చూపుల మాయా
తొలకరిలో తడిసిన హాయా
తనువుల తకధిమి చూశావా
ప్రియా... ఆ...
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర వుందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే॥సే॥
చరణం : 1
నా గుండెలోన మేండలీను మోగుతున్నదే
ఒళ్లు తస్సదియ్య స్ప్రింగులాగ
ఊగుతున్నదే
హో సనం... నాలో సగం
పైట పాలపిట్ట గుంపులాగ ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్ధమేదో
జరుగుతున్నదే
నీ వశం... తేరే కసం
పిల్లికళ్ల చిన్నదాన్ని మళ్లి మళ్లి చూసి
వెల్లకిల్ల పడ్డ ఈడు ఈలవేసే
కల్లుతాగి కోతిలాగ పిల్లి మొగ్గలేసే
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర వుందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే
చరణం : 2
రెండు కళ్లలోన కార్నివాల్ జరుగుతున్నదే
వింత హాయి నన్ను వాలిబాల్ ఆడుతున్నదే
ఈ సుఖం... అదో రకం
బుగ్గ పోస్టుకార్డు
ముద్దు ముద్దరెయ్యమన్నదే
లేకపోతే సిగ్గు ఊరుదాటి వెళ్లనన్నదే
ఈ క్షణం... నిరీక్షణం
హే... చుక్కలాంటి చక్కనమ్మ
నాకు దక్కినాదే
చుక్క ఏసుకున్నా ఇంత కిక్కురాదే
లబ్బుడబ్బు మాని
గుండె డంకనక ఆడే... హో
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చూస్తే నీ దగ్గర వుందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే॥సే॥