చిత్రం : దేవరాగం(dEvarAgam) (1996)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : ఎస్.పి.బాలు, ఎం.ఎం.శ్రీలేఖ
పల్లవి :
యా యా యా యా
నెమలి కన్నుల కలయా
యా యా యా యా
మురళీమోహన కళయా
చిలిపిగా ఓలమ్మో ఏదో తాళం
కడవలో పాలన్నీ తోడే రాగం
తన్నా... తన్నా...
జతై కలిసిన లయా కౌగిళ్ల నిలయా
కవ్వించుకోవయ్యా ॥యా॥
చరణం : 1
నీ లీలలే నా డోలలై
వేడి ఈల వేసే వేణుగానమల్లే
వాలు సందెవేళ చందనాలు జల్లే
మోమాటమే పెపైదవిలో
తేనెటీగలొచ్చి కుట్టినట్టు గిల్లే
లేత చెక్కిలింక ఎర్రముగ్గు జల్లే
గోపిక మనువాడే గోవుల కన్నుల్లో
వెన్నెల తెరవేసే పొన్నల నీడల్లో
విరిసిన పూలే జల్లి దీవుల్లోన
తడిపొడి తానాలాడించే
ప్రియా చిలికిన దయా
చిలిపి హృదయా కౌగిళ్ల నిలయా॥యా॥
చరణం : 2
ఈనాటిదా ఈ సంగమం
చూసీ చూడలేని
చూపులమ్మ చుంబనం
కంటిరెప్ప చాటు రేతిరమ్మ శోభనం
నీ మాటలే సయ్యాటలై
కొల్లగొట్టనేల కోకమాటు వగలే
కన్నుకొట్టనేల కాముడల్లే పగలే
యదుకుల గోపెమ్మ
ముసిముసి మురిపాలు
యమునల వరదమ్మా
అడిగెను రాధమ్మ
అతి సుఖ రాగాలెన్నో ఆలపించే
సాయంత్రాల నీడల్లో జతై
కలిసిన లయా కౌగిళ్ల నిలయా
కవ్వించుకోవయ్యా॥యా॥