చిత్రం : భాగ్యచక్రము(bhAgyachakramu) (1968)
రచన : పింగళి(pi~ngaLi)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు(peNDyAla nAgEswararAo)
గానం : ఘంటసాల, పి.సుశీల(ghanTasAla,P.suSeela)
06 May - నేడు పింగళి వర్ధంతి
పల్లవి :
నీవులేక నిముసమైన నిలువజాలనే (2)
నీవె కాదా ప్రేమ నాలో విరియచేసినది (2)
మ్మ్... విరియ చేసినది...
ఈ... విరియ చేసినది...
నీవులేక నీముసమైన నిలువజాలనే
చరణం : 1
లోకమంతా నీవుగానే నాకు తోచెనుగా (2)
మరువరాని మమతలేవో
మదిని పూసెనుగా (2)
ఆ... మదిని పూసెనుగా...
నీవులేక నీముసమైన నిలువజాలనే
చరణం : 2
ఒకరికోసం ఒకరమనిన ఊహ తెలిసెనుగా
ఒకరికోసం ఒకరమనిన ఊహ తెలిసెనుగా
వీడిపోని నీడవోలే కూడి ఉందుముగా (2)
ఆ... కూడి ఉందుముగా...॥
Special Note:
పూర్తిపేరు : పింగళి నాగేంద్రరావు
జననం : 29-12-1901
జన్మస్థలం : బొబ్బిలి తాలుకా రాజాం
తల్లిదండ్రులు : మహాలక్ష్మమ్మ,గోపాలకృష్ణయ్య
చదువు : మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో
తొలిచిత్రం - పాట : భలేపెళ్లి (1942) - మనోహరీ అని అనేక కన్నెల
ఆఖరిచిత్రం - పాట : నీతి నిజాయితీ (1972) - భలే మజాలే భలే ఖుషీలే
పాటలు: సుమారు 300 (28 చిత్రాలు)
కథ, మాటలు, పాటలు అందించిన తొలిచిత్రం : భలేపెళ్లి (1942)
ఆఖరిచిత్రం : శ్రీకృష్ణసత్య (1971)(ఆయన మరణాంతరం విడుదలైంది)
మాటలు అందించిన ఆఖరిచిత్రం : చాణక్య చంద్రగుప్త (1977)
ఇతరవిషయాలు
: పింగళికి రెండేళ్ల వయసు ఉన్నప్పడు కుటుంబం బందర్‌కు వలసి వచ్చింది.
అక్కడ పింగళి వారి బాల్యం, విద్యాభ్యాసం కొనసాగింది. పింగళి తల్లి
కవయిత్రి కావడంతో భారత భాగవత రామాయణా దులలు పింగళికి ఒంటబట్టాయి.
సినిమాలకు రాక ముందు టీచర్‌గా, రైల్వే ఉద్యోగిగా ‘కృష్ణాపత్రిక’, ‘శారద
పత్రిక’లలో ఉపసంపాదకునిగా పనిచేశారు. శారద పత్రిక నిలిచిపోగానే, తర్వాత
డి.వి.సుబ్బా రావు గారి ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలో చేరి 1946 వరకు
సెక్రటరీగా పనిచేశారు. పింగళి జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు.
రామ్మూర్తి అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. 1941లో ‘భలేపెళ్లి-
తారుమారు’ జోడు చిత్రాలకు పనిచేసే అవకాశం వచ్చింది. కాని రెండో ప్రపంచ
యుద్ధం జరగడంతో మద్రాస్‌లో సినీ నిర్మాణం కుంటుపడింది. తర్వాత 1946లో డా.
దుర్గా నాగేశ్వరరావు, డి.వి.సుబ్బారావులు పింగళిని పిలిచి ఆయన రాసిన
‘వింధ్యారాణి’ నాటకాన్ని చిత్రంగా తీశారు. అది పరాజయం అంచున ఉండిపోయింది.
ఆ సమయంలో మిత్రుడైన బందర్ వాస్తవ్యులు కమలాకర కామేశ్వరరావు పింగళికి
ధైర్యం చెప్పి, కె.వి.రెడ్డికి పరిచయం చేశారు. వారి కలయిక ఇక పింగళివారి
పేరును తారస్థాయికి తీసుకొని వెళ్లింది. సినీ జగత్తును తన మాటల, పాటల
మాయాజాలంతో ఆశ్చర్యం కల్పించిన మాంత్రికుడు పింగళి అనటంలో ఎటువంటి
అతిశయోక్తిలేదు.
మరణం : 06-05-1971