prachaNDa chaNDa - ప్రచండ చండ మార్తాండ
చిత్రం : దమ్ము(dammu) (2012)రచన : చంద్రబోస్(chandrabOse)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : ఫృథ్వీచంద్ర, గీతామాధురి,రేవంత్, జి.సాహితి
10 May - నేడు చంద్రబోస్ పుట్టినరోజు
సాకీ :
అంగ వంగ కేరళ కళింగ గౌడ కుంతల
విదర్భ మగధ సింహళ సాళ్వ గౌళ బర్బర
అవంతి చోళ లాట పాండ్య చేరి మద్ర
చక్రవర్తులెందరున్నా వీడు ఏకవీరుడు
ఏకైక క్షాత్రవీరుడు
కావ్య చిత్రలేఖనం సంగీత శిల్ప నాటకం
సాముద్రికం ఉచ్ఛాటనం
ఆకర్షణం విద్వేషణం
అగ్ని జల వయస్తంభం
బహుకళాప్రవీణుడు
ప్రవీణుడు నవీనుడు...
బాణ ఖడ్గ చేరి శక్తి యష్టి ప్రాశ గద పాశ
వజ్ర దండ కుంత శూల
ధనుర్విద్యా ప్రపూర్ణుడు
ఘనఘనఘన ఘనుడు
అగిణిత గుణ ఘనుడు
జనగణమున ఘనుడు
రూలర్... రూలర్...
పల్లవి :
ప్రచండ చండ మార్తాండ తేజా...
రాజాధి రాజాధిరాజా
అఖండ మండలానంద భోజా...
రాజధి రాజాధిరాజా
చరితలో వెలుగుతున్న జ్యోతి నీదే
జగతిలో ఎగురుతున్న కీర్తి నీదే
పోరు నీది పేరు నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్... రూలర్...॥ప్రచండ ॥
చరణం : 1
ముందు నుండి ముంచుకొచ్చు
మృగాలనైనా
పిడికిలితో ఫెళఫెళఫెళ కూల్చేస్తా
వెనక నుండి తరుముకొచ్చు జ్వాలలనైనా
పాదంతో దబదబదబ తొక్కేస్తా
అందుకే మరందుకే మరందుకే
అందాలని అరచేతిలో పెడుతున్నా
నీకే అందాలని ఆరాట పడుతున్నా
కెరటమై ఉరుకుతున్న చురుకు నీదే
కదనమై దుముకుతున్న దుడుకు నీదే
ఆట నీది వేట నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్... రూలర్...॥
చరణం : 2
బీద ధనిక అంతరాలు అంతం చేసి
అందరిపై సమభావం చూపాలి
బంధుప్రీతి వర్గప్రీతి దూరం చేసి
అనునిత్యం సమధర్మం చాటాలి
అందుకే మరందుకే మరందుకే
ప్రాణంలో సగభాగం ఇస్తున్నా
నీ ప్రణయంతో సంపూర్ణమౌతున్నా
శిఖరమే శిరసు వంచు గెలుపు నీదే
గగనమే మెలిక తిరుగు మెరుపు నీదే
నీతి నీది ఖ్యాతి నీది...
భువన భవన కరుణ కిరణ
ప్రభువు నువ్వులే
రూలర్...