Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

andananta ettA - అందనంత ఎత్తా

చిత్రం : క్షణ క్షణం(kshaNa kshaNam) (1991)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : ఎం.ఎం. కీరవాణి(M.M.keeravANi)
గానం : ఎస్.పి.బాలు, చిత్ర(S.P.bAlu, chitra)


పల్లవి :
అందనంత ఎత్తా తారాతీరం
సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంతా కొత్తా తాళం తీస్తే
సందె విందు సొంతం కాదా //అందనంత//
చిందే సరదా పొంగే వరదా
స్వర్గం మన సమీపయ్యేంత //అందనంత//
చరణం : 1
గువ్వ నీడలో గూడు కట్టుకో
కుర్ర వేడిలో కుకూ కూత పెట్టుకో
దిక్కులన్నీ తెగించే వేగంతో
రెక్క విప్పు నిషాలెన్నో
గుప్పెడంత కులాసా గుండెల్లో
గుప్పుమన్న ఖుషీలెన్నో
తోటమాలి చూడకుండ
ఏటవాలు పాటవెంట
మొగ్గనవ్వు చేరుకుంటే
చుక్కలింట పండగంట //అందనంత//
చరణం : 2
కొంటె కోనలో కోట కట్టుకో
కొత్త కోకలో కో కో కోరికందుకో
కోనకళ్ల గులాబీ గుమ్మంలో
కాచుకున్న కబుర్లెన్నో
కప్పుకున్న కిలాడీ కొమ్మల్లో
గుచ్చుకున్న గుణాలెన్నో
లాగుతున్న గాలి వెంట
సాగుతున్న పూలమంట
తాకుతుంటే దాగదంట
ఆకాశాన పాలపుంత //అందనంత//

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |