chilakA gOri~mkA kulikE - చిలకా గోరింకా కులికే
చిత్రం : చెంచులక్ష్మి(chenchu lakshmi) (1958)రచన : ఆరుద్ర
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, జిక్కి
04 June - ఆరుద్ర వర్ధంతి
పల్లవి :
చిలకా గోరింకా కులికే పకాపకా
నేనే చిలకైతే నీవే గోరింకా రావా నావంక
చిలకా గోరింకా కులికే పకాపకా
నీవే చిలకైతే నేనే గోరింకా రావా నావంక
చరణం: 1
చెలియా నేటికి చెలిమి ఫలించెనే
కలలూ కన్నట్టి కలిమి లభించెనే॥
మనసే నిజమాయే తనువులు ఒకటాయే
మదిలో తలంపులే తీరే తీయగా
మారే హాయిగా... ॥
చరణం: 2
కలికీ నీవిలా ఎదుట నిలబడ
పలుకే బంగారం ఒలికే వయ్యారమే॥
ఒకటే సరాగము ఒకటే పరాచికం
కలసి విహారమే చేద్దాం హాయిగా
నీవే నేనుగా...॥
Special Notes:
అసలు పేరు : భాగవతుల సూర్యనారాయణ సదాశివశంకరశాస్త్రి
జననం : 31-8-1925
జన్మస్థలం : విశాఖపట్టణం
తల్లిదండ్రులు : వెంకట జోగమ్మ, నరసింగరావు
చదువు :ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషన్
వివాహం - భార్య : 28-4-1955 కె.రామలక్ష్మి (ప్రముఖ రచయిత్రి)
సంతానం : కుమార్తెలు (వాసంతి, కవిత, కీ.శే.లలిత ముఖర్జీ, త్రివేణి గురుకర్)
తొలిచిత్రం-పాట : బీదలపాట్లు (1950)-ఓ చిలకరాజా నీకు పెళ్లెపుడయ్యా...
ఆఖరిచిత్రం : పెళ్లికొడుకు (1996)
మాటలు అందించిన మొదటిచిత్రం : పరోపకారం (1953)
పాటలు : తెలుగులో నేరుగా 4వేలకు పైగా, డబ్బింగ్ పాటలు 300 పైగా (దాదాపు 400 చిత్రాలకు)
గౌరవపురస్కారాలు : 1985లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు, ఆంధ్ర కళా పరిషత్తు వారి నుండి ‘కళాప్రపూర్ణ’ బిరుదును ప్రదానం చేశాయి.
ఇతరవిషయాలు : ఆరుద్రకు తండ్రి నరసింగరావే తొలి సాహిత్య గురువు. తన 13వ ఏటనే రాసిన తొలి కవిత ‘నా కలలో...’ 1939లో చిత్రగుప్త అనే వారపత్రికలో ప్రచురితమైంది. 1943-49 మధ్య ముంబైలో ‘రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్’లో గుమాస్తాగా, ఆ తర్వాత ‘ఆనందవాణి’ పత్రిక సంపాదకుడిగా, విశాఖలో హార్బర్ గుమాస్తాగా, లైకోగ్రాఫ్ స్టూడియోలో ఫోటో గ్రాఫర్‌గా, ఆ తర్వాత ‘ఢంకా’ పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా చేరారు. 1949లో న్యాపతి నారాయణమూర్తిద్వారా మొదటిసారి సినీ రచయితగా ‘సౌదామని (1951)’ చిత్రంతో పరిచయమయ్యారు. 2007లో ఆరుద్ర విగ్రహాన్ని విశాఖ తీరంలో ప్రతిష్టించారు.
మరణం : 04-06-1998