చిత్రం: కన్యాకుమారి(kanyAkumAri) (1977)
రచన: వేటూరి
సంగీతం, గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
04 June - నేడు ఎస్.పి.బాలు బర్త్‌డే
(S.P.bAlu birthday)
పల్లవి :
ఓహో చెలీ... ఓ నా చెలీ...
ఇది తొలిపాట ఒక చెలిపాట
వినిపించనా ఈ పూట ఆ పాట ॥
చరణం : 1
ఎదుట నీవు ఎదలో నీవు
ఎదిగి ఒదిగి నాతో ఉంటే
మాటలన్నీ పాటలై...
మధువులొలుకు మమతే పాట
నీలినీలి నీ కన్నులలో
నీడలైన నా కవితలలో
నీ చల్లని చరణాలే
నిలుపుకొన్న వలపీ పాట
పరిమళించు ఆ బంధాలే
పరవశించి పాడనా పాడనా... పాడనా...
॥చెలీ॥
చరణం : 2
చీకటిలో వాకిట నిలిచి
దోసిట సిరిమల్లెలు కొలిచి
నిదురకాచి నీకై వేచి
నిలువెల్లా కవితలు చేసి
కదలి కదలి నీవొస్తుంటే
కడలి పొంగులనిపిస్తుంటే
వెన్నెలనై నీలో అలనై నీవెల్లువకే వేణువునై
పొరలి పొంగు నీ అందాలే
పరవశించి పాడనా పాడనా... పాడనా...
Special Note:
పూర్తి పేరు : శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
జననం : 4-6-1946
జన్మస్థలం : కోనేటమ్మపేట, నెల్లూరు (ఇప్పుడు తమిళనాడులో కలిసిపోయింది)
తల్లిదండ్రులు : శంకుతల, సాంబమూర్తి
చదువు : సెక్షన్ ఎ అండ్ బి (మధ్యలో ఆపేశారు)
భార్య : సావిత్రి
పిల్లలు : కుమారుడు ఎస్.పి.చరణ్ (నటుడు, గాయకుడు), కుమార్తె పల్లవి
గాయకునిగా తొలిచిత్రం-పాట : శ్రీశ్రీశ్రీమర్యాదరామన్న (1967)-ఏమి ఈ వింత మోహము...(15-12-1966 న రికార్డింగ్ జరిగింది)
పాటలు : 36వేలకు పైగా (దాదాపు 16 భాషలు)
సంగీత దర్శకునిగా తొలిచ్రితం : కన్యాకుమారి (1977)
చిత్రాలు : 60 (తెలుగు, తమిళం, కన్నడం, హిందీ)
నటుడిగా తొలిచిత్రం : మహ్మద్‌బీన్ తుగ్లక్ (1972)
డ బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తొలిచిత్రం : మన్మథలీలలు (1976)
నిర్మాతగా : డబ్బింగ్ చిత్రాలు యోధ, భామనే సత్యభామనే, తెనాలి. తమిళంలో హలోబ్రదర్, తెలుగులో శుభసంకల్పం
అవార్డులు-పురస్కారాలు :
1999లో శ్రీ పొట్టిశ్రీరాముల తెలుగు యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేటు, 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్. గాయకునిగా తెలుగులో మూడు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఒక్కొక్క జాతీయ అవార్డు అందుకున్నారు. 25 సార్లు నంది అవార్డులు, తమిళనాడు నుంది కలైమామణి, మైనే ప్యార్ కియా చిత్రానికి ఫిలింఫేర్, సత్యభామ యూనివర్సిటీ, జె.ఎన్.టి.యు. నుండి గౌరవ డాక్టరేటు, ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ, శ్రీశైల, మంత్రాలయ దేవస్థానాలకు ఆస్థాన విద్వాంసునిగా, మరెన్నో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, జాతీయ పురస్కారాలు, ఫిలింఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డులు, మరెన్నో సంగీత అవార్డులు ఆయనను వరించాయి.