Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

eeswarA ni~mgi nEla - ఈశ్వరా నింగి నేల

చిత్రం : మనసులో మాట(manasulO mATa) (1999)
రచన : వేటూరి
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
గానం : ఉదిత్ నారాయణ్, బృందం
01 June - నేడు ఎస్.వి.కృష్ణారెడ్డి బర్త్‌డే


పల్లవి :
ఈశ్వరా నింగి నేల హాండ్‌షేక్ చేసిన
ఘనతే నీదిరా
ఈశ్వరా సూర్యచంద్రులనొక్కటి
చేసిన కథయే నీదిరా
తూర్పు పడమర ఫ్రెండ్‌షిప్ చేసిన
ఘటనే నీదిరా
వన్ ఇన్‌టూ ప్రాణేశ్వరా
వన్ ప్లస్ వన్ జీవేశ్వరా
ఆల్ ద బెస్ట్ ఆత్మేశ్వరా
ఆ మాటే ఆశీస్సురా
మండుటెండలు
మల్లెలు చేసిన ఈశ్వరా
ముళ్లు మెత్తని పూలుగ మార్చిన
ఈశ్వరా
జాన్‌దో సహోదరా జగడాలు లేవురా॥
చరణం : 1
కూచిపూడినడగొచ్చులే ఒసిబిస
హాలివుడ్‌లో తీయొచ్చులే లవకుశ
మడోనాకు నేర్పొచ్చులే పదనిస
కొండకేసి లాగొచ్చులే పురికొస
కోకిల పాటల్లో స్నేహమే
కొమ్మకు సన్నాయి
కంటికి రెప్పల్లే కాచిన
స్నేహం మనదోయి
జాన్‌దో సహోదరా జగడాలు లేవురా॥
చరణం : 2
పార్లమెంటునడగొచ్చులే పెళ్లికి
తాజ్‌మహల్‌నడగొచ్చులే విడిదికి
జాక్సనొస్తే అడగొచ్చులే జావళి
బాలమురళినడగొచ్చులే రాప్‌నీ
కురిసిన మబ్బుల్లో స్నేహమే
రంగుల హరివిల్లు
మురిసిన నవ్వుల్లో స్నేహమే
మల్లెలు వెదజల్లు
జాన్‌దో సహోదరా జగడాలు లేవురా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |