InATi IhAyi - ఈనాటి ఈ హాయి
చిత్రం : జయసింహ(jayasimha) (1955)రచన : సముద్రాల జానియర్
సంగీతం : టి.వి.రాజు
గానం : ఘంటసాల, పి.లీల
31 May - నేడు సముద్రాల జానియర్ వర్ధంతి
పల్లవి :
ఈనాటి ఈ హాయి
కలకాదోయి నిజమోయి (2)॥
చరణం : 1
నీ ఊహతోనే పులకించిపోయే
ఈ మేను నీదోయి (2)
నీకోసమే ఈ అడియాసలన్నీ
నా ధ్యాస నా ఆశ నీవే కదా ॥
చరణం : 2
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
నీ ప్రేమ జవరాలా (2)
మనియేములే ఇక విరితావి లీల
మన ప్రేమకెదురేది లేదే సఖీ॥
చరణం : 3
ఊగేములే తులతూగేములే
ఇక తొలిప్రేమ భోగాలా (2)
మురిపాల తేలే మన జీవితాలు (2)
దరహాస లీలా విలాసాలులే॥
Special Note:
పూర్తిపేరు : సముద్రాల రామానుజాచార్యులు
జననం : 15-04-1923
జన్మస్థలం : పెదపులివర్రు గ్రామం, కృష్ణాతీరం
తల్లిదండ్రులు : రత్నమ్మ, సముద్రాల రాఘవాచార్యులు (సముద్రాల సీనియర్)
తోబుట్టువులు : తమ్ముడు వేంకట శేషాచార్యులు, చెల్లెళ్లు కుముద వల్లి తాయారు, అలివేలు మంగతాయారు
చదువు : బి.ఎస్సీ. (చెన్నైలో పచ్చయప్ప కాలేజీ)
వివాహం - భార్య :
16-10-1945 - ఆండాళమ్మ
పిల్లలు : ముగ్గురు కుమారులు (రంగపార్థసారథి, రాజగోపాల్, విజయ రాఘవాచార్యులు), నలుగురు కుమార్తెలు (రమాదేవి, యశోద, కీ.శే. నీల, శుభశ్రీ )
తొలిసినిమా : శాంతి (1952)
ఆఖరిపాట - సినిమా :
టైటిల్‌సాంగ్ - లక్ష్మణరేఖ (1975)
పాటలు : దాదాపు 150 చిత్రాలకు 300పైగా పాటలు
మాటలు అందించిన మొదటిచిత్రం :తోడుదొంగలు (1954)
చివరిచిత్రం : క్రాంతి (1981)
కథ-మాటలు-పాటలు అందించిన మొదటిచిత్రం : జయసింహ (1955)
ఇతరవిషయాలు : తండ్రిలాగానే చిన్నప్పటి నుండే సాహిత్యం, సంగీతం పట్ల మక్కువ ఏర్పరుచు కున్నారు. చెన్నై వాహినీ స్టూడియోలో శబ్దశాఖలో రికార్డిస్టుగా పనిచేశారు. ఘంటసాల, ఎన్‌టీఆర్‌లు సముద్రాల వారికి ఆప్తమిత్రులు. ఘంటసాల-సముద్రాల జూనియర్ కాంబినేషన్‌లో వచ్చిన గీతాలు హిట్‌గా నిలిచాయి. 1960 తర్వాత పాటల కన్నా సంభాషణలే ఎక్కువగా
రాశారు. విశ్వనాథనాయకుడు, సామ్రాట్ అశోక వంటి చిత్రాలకు స్క్రిప్టు అందించారు.
మరణం : 31-05-1985