Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

EnATikI manamokaTEnani - ఏనాటికీ మనమొకటేనని

చిత్రం : శివమణి (SivamaNi) (2003)
రచన : భాస్కరభట్ల
సంగీతం : చక్రి
గానం : రఘు కుంచె, కౌసల్య


పల్లవి :
ఏనాటికీ మనమొకటేనని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని
తెలిసిందిలే కలగన్నామని
కన్నీరు జోరయ్యింది
ఆ నీరు ఏరయ్యింది
నువ్వు లేక సంతోషమా
వాకిట్లో వసంతాలు ఆనాటి సాయంత్రాలు
నువ్వు లేక శూన్యం సుమా
నాతోనే నువ్వు ఉంటానని
ఆరోజే నువ్వు అన్నావని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా॥
చరణం : 1
నీ కోసమే మిగిలున్నానిలా
నువ్వురాక నేనింక ఎన్నాళ్లిలా
నా గుండెలో నీ ఆలోచన
నా కంటిపాపల్లో ఆవేదన
ఇది మౌనరాగాల సంకీర్తన
ఇలా చూడు ఏవైపు అడుగేసినా
నీలోనే సగమున్నాననీ
నీకోసం మిగిలున్నాననీ
ఎలా నీకు తెలిపేది
ఓ నేస్తమా॥
చరణం : 2
మరుపన్నది ఇటు
రాదే ఎలా
నా మనసుకేమైంది
లోలోపల
వలపన్నది చెలరేగే అలా
ఎదలోన దాగుండిపోదే ఎలా
జడివానలా వచ్చి తడిపేయవా
ప్రియా అంటూ ప్రేమార పిలిచేయవా
నీవైపే ఎద లాగిందని
నీ చూపే అది కోరిందని
చెలీ నీకు తెలిశాక చెలగాటమా॥॥
Watch Some more songs from this movie:

Mona Mona
Rama Rama

Listen all songs:
SivamaNi (Or)
SivamaNi

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |