evariki evaru kApalA - ఎవరికి ఎవరు కాపలా
చిత్రం : ఇంటికి దీపం ఇల్లాలు(inTiki deepam illAlu) (1961)రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.బి.శ్రీనివాస్
పల్లవి :
ఎవరికి ఎవరు కాపలా... ఆ...
బంధాలన్నీ నీకేలా॥
ఈ బంధాలన్నీ నీకేలా॥
చరణం : 1
తనువుకు ప్రాణం కాపలా
మనిషికి మనసే కాపలా
తనువును వదిలి తరలే వేళ...
తనువును వదిలి తరలే వేళ
మన మంచే... మనకు కాపలా॥
చరణం : 2
కంటికి రెప్పే కాపలా
కలిమికి ధర్మం కాపలా
కలిమి సర్వము తొలగిన వేళ
పెట్టినదేరా... గట్టి కాపలా॥
చరణం : 3
చిన్నతనాన తల్లి కాపలా
వయసున వలచిన వారు కాపలా
ఎవరి ప్రేమకు నోచని వేళ
కన్నీరేరా... నీకు కాపలా
కన్నీరేరా నీకు కాపలా॥