O AkAsam ammAyaitE - ఓ... ఆకాశం అమ్మాయైతే
చిత్రం : గబ్బర్‌సింగ్(gabbar singh) (2012)రచన : చంద్రబోస్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ
సాకీ :
ఏం చక్కని మందారం
ఇది ఎనిమిది దిక్కుల సిందూరం
ఏం మెత్తని బంగారం
ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం
ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం
ఇక తియ్యని ప్రేమకి తయ్యారం
పల్లవి :
ఓ... ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే
నీలా ఉంటుందే
ఓ... ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే
నాలా ఉంటుందే నాలా ఉంటుందే...
వానల్లే నువ్వు జారగా నేలల్లే నేను మారగా
వాగల్లే నువ్వు నేను చేరగా
మది వరదై పొంగి సాగరమౌతుందే
హోలా హోలాహ హోలా హోలాహ
నీ కళ్లలోన చిక్కానే పిల్లా
హోలా హోలాహ హోలా హోలాహ
ఇక చాలా చాలా జరిగే నీవల్ల॥చక్కని॥
చరణం : 1
అల్లేసి నను గిల్లేసి తెగ నవ్వినావే
సుగుణాల రాక్షసి శత్రువంటి ప్రేయసి
పట్టేసి కనికట్టేసి దడ పెంచినావే
దయలేని ఊర్వశీ దేవతంటి రూపసి
గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే
నిద్దుర పుచ్చేనే
ఓ... లోకంలో అందాలన్నీ
నీలో చేరేనే నిద్దుర లేపేనే
హోలా హోలాహ హోలా హోలాహ
నీ కళ్లలోన చిక్కానే పిల్లా
హోలా హోలాహ హోలా హోలాహ
ఇక చాలా చాలా జరిగే నీవల్ల
ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం
ఈనాడే తెలిసింది కొత్తపదం
ఆనందం ఆనందం నీవల్లే ఇంతానందం
గుండెల్లో కదిలింది పూల రథం
చరణం : 2
వచ్చేసి మది గిచ్చేసి మసి చేసినావే
ఋషిలాంటి నా రుచి మార్చినావే అభిరుచి
సిగ్గేసి చలిమొగ్గేసి ఉసి గొలిపినావే
సరిగమగా పదనిస చేర్చినావే రోదసీ
స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే
ప్రాణం పోసేనే
ఓ... నరకంలో నానా హింసలు
నీలో సొగసేనే ప్రాణం పోసేనే
హోలా హోలాహ హోలా హోలాహ
నీ కళ్లలోన చిక్కానే పిల్లా
హోలా హోలాహ హోలా హోలాహ
ఇక చాలా చాలా జరిగే నీవల్ల॥చక్కని॥