Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

peddAyanA peddAyanA - పెద్దాయనా పెద్దాయనా

చిత్రం : పెద్దాయన(peddAyana) (2006)
రచన : వెన్నెలకంటి
సంగీతం : రమణీ భరద్వాజ్
గానం : ఆర్.పి.పట్నాయక్


వెర్షన్ - 1
పల్లవి :
పెద్దాయనా పెద్దాయనా...
నువు వెయ్యేళ్లు వర్థిల్లు పెద్దాయనా
పేదోళ్లకు సాయం చేసే
పెన్నిధివయ్యా పెద్దాయన
గుడిలేని దేవుడంటా బంగారుసామి
పుణ్యం చేసుకున్నదయ్యా
నిన్నుగన్న భూమి॥ గుడిలేని ॥
నేల ఎండిపోయి గుండె మండి
పోయి మెతుకే మాకు కరువాయే
చేను బీడువారి మేను మోడువారి
బతుకే మాకు బరువాయే
కూడెట్టి లేనోళ్ల కాపాడు వాడా
మా గుండె గుళ్లోన కొలువైన రేడా॥ పెద్దాయనా ॥
చరణం: 1
ఋషిలాంటి మనిషొచ్చి
మాకు అండగా ఉన్నాడు
కృషి ఉంటే మనకెపుడూ
కరువు రాదులే అన్నాడు
కష్టపడేవారి ఇంట్లో
కలిమి కొలువు కాదా
చెమట చలువ సోకి
నేల సిరుల మొలకనీదా
హస్తవాసి మలుకు
మస్తుగున్నదంటా
మస్తు అన్నమాటే
వస్తు ఉన్నదంటా ॥ పెద్దాయనా ॥
అయ్యగారి కాలు సోకి
బీడు మాగాణైనది
అయ్యాగారి చూపు చూసి
చిగురేసింది
నేడు మన పల్లె మారి
రేపల్లె అయినది
గంగ పొంగి ఊరి దాహం
తీర్చునున్నది
చరణం : 2
చంద్రుడికి మచ్చుంది
మచ్చలేనిది నీ స్నేహం
పువ్వైన వాడుతుంది
వాడిపోనిది మీ బంధం
తెల్లపంచె కట్టే నీకు
మనసు తెల్లనంటా
చల్లనైన ఎదలో పొంగే
ప్రేమ వెల్లువంటా
చెప్పినట్టు చేసే మనిషివంటే నువ్వే
చెక్కు చెదరదంటా
పెదవి మీద నవ్వే ॥ పెద్దాయనా ॥
వెర్షన్ - 2
పెద్దాయనా... పెద్దాయనా...
ఇది స్వార్థపు లోకం పెద్దాయనా
పెద్దాయనా.. పెద్దాయనా...
ఇది చెడు కలికాలం పెద్దాయనా
దానం చేసే ఎముకలేని
చేతకి సంకెళ్లు
పువ్వులాంటి మనసులోన
నాటినయ్యొ ముళ్లు
తనువుకెన్ని గాయాలైన
మాసిపోవునంటా
మనసుకొక్క గాయమైన
మాసిపోదు మంట
మంచితనాన్ని పంచిన చోటే
వంచన రాజ్యం చేస్తోంది
వేల మనసుల్లో వేలుపు దొరను
నేరస్థుడిగా చూస్తోంది
కారుమబ్బు స్యూరుని
దాచిపెట్టగలదా!
కాలుతున్న నిప్పుకు
చేదపట్టగలదా!॥ పెద్దాయనా ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |