Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

antaTa nI rUpam - అంతట నీ రూపం

చిత్రం : పూజ(Pooja) (1979)
రచన : దాశరథి
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
అంతట నీ రూపం నన్నే చూడనీ
ఆశలు పండించే నిన్నే చేరనీ
నీ కోసమే... నా జీవితం
నా కోసమే... నీ జీవితం॥ అంతట ॥
చరణం : 1
నీవే లేని వేళ ఈ పూచే పూవులేల
వీచే గాలి వేసే ఈల ఇంక ఏలనే
కోయిల పాటలతో పిలిచే నా చెలి
ఆకుల గలగలలో నడిచే కోమలి॥ అంతట ॥
చరణం : 2
నాలో ఉన్న కలలు
మరి నీలో ఉన్న కలలు
అన్నీ నేడు నిజమౌవేళ రానే వ చ్చెనే
తీయని తేనెలకై తిరిగే తుమ్మెద
నీ చిరునవ్వులకై వెతికే నా ఎద॥ అంతట ॥

malletIga vADipOgA - మల్లెతీగ వాడిపోగా

పల్లవి :
మల్లెతీగ వాడిపోగా
మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయవీణ
తిరిగి పాట పాడునా
మనసులోని మమతలన్నీ
మాసిపోయి కుములు వేళ
మిగిలింది ఆవేదన ॥ మల్లెతీగ ॥
చరణం : 1
నిప్పు రగిలి రేగు జ్వాల
నీళ్ల వలన ఆరును
నీళ్లలోనే జ్వాల రేగ
మంట ఎటుల ఆరును(2)॥ మల్లెతీగ ॥
చరణం : 2
కడలిలోన మునుగువేళ
పడవ మనకు తోడురా
పడవ సుడిని మునుగువేళ
ఎవరు మనకు తోడురా (2)
ఆటగాని కోరికేమో
తెలియలేని జీవులం
జీవితాల ఆటలోన
మనమంతా పావులం

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |