Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

undilE ma~nchikAlam - ఉందిలే మంచికాలం

చిత్రం : రాముడు-భీముడు (rAmuDu bheemuDu) (1964)
రచన : శ్రీశ్రీ
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల, మాధవపెద్ది సత్యం,పి.సుశీల
15 June - శ్రీశ్రీ వర్ధంతి


పల్లవి :
ఉందిలే మంచికాలం
ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా॥
చరణం : 1
ఎందుకో సందేహమెందుకో
రానున్న విందులో
నీవంతు అందుకో ॥
ఆ రోజూ అదిగో కలదూ నీ ఎదుట...
నీవే రాజువటా ॥
ఏవిటేవిటేవిటీ
మంచికాలమంటున్నావు
ఎలాగుంటుందని విశదంగా చెప్పు
దేశ సంపద పెరిగేరోజు
మనిషి మనిషిగా బ్రతికేరోజు (2)
గాంధి మహాత్ముడు కలగన్న రోజు
నెహ్రూ అమాత్యుడు
నెలకొల్పు రోజు
ఆ రోజెంతో దూరం లేదూ
రండయ్యో
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో॥రోజెంతో॥
చరణం : 2
భలే భలే బాగా సెప్పావ్
కానీ అందుకు మనమేం చేయాలో అదికూడా నువ్వే చెప్పు
అందరికోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరు కలసి (2)
సహకారమే మన వైఖరి ఐతే
ఉపకారమే మన ఊపిరి ఐతే
పేద గొప్పా భేదం పోయీ అందరూ
నీది నాదని వాదం మాని ఉందురూ॥రోజెంతో॥
తీయగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా సుఖశాంతులూరగా
ఆకాశ వీధుల ఎదురే లేకుండా
ఎగురును మన జెండా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |