Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

EmiTO idi EmiTO - ఏమిటో ఇది ఏమిటో


చిత్రం : భలేరంగడు(bhalE ra~mgaDu) (1969)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల


పల్లవి :
ఏమిటో ఇది ఏమిటో
పలుకలేని మౌనగీతి
తెలియరాని అనుభూతి
ఏమిటో ఇది ఏమిటో॥
చరణం : 1
అద్దంలో నా నీడ
ముద్దుముద్దుగా తోచింది
ఆ నీడ నను చూసి
అదోలా నవ్వేసింది
చెప్పకనే చిలిపి పయ్యెద
చప్పున జారిపోయింది
ఒంటరిగా... పడుకుంటే...
ఒంటరిగా పడుకుంటే
కొంటె నిదుర రాన ంటుంది॥
చరణం : 2
చీకటిలో నిదుర రానిచో
చిరుదివ్వెను వెలిగించనా
ఆ చిరువెలుగే పనికిరానిచో
నా కనులే వెలిగించనా
తలపులు దాచిన
నా మనసే తలగడగా అందించినా
కమ్మని కలలే... పండేదాకా...
కమ్మని కలలే పండేదాకా
కథలేవో వినిపించనా॥
చరణం : 3
గుండెలోన వలపు మల్లి
కొత్తరేకులు విరిసింది
కిటికీలోన జాబిల్లి
కటిక నిప్పులు చెరిగింది
విరిసిన వలపే ఘుమఘుమలాడే
తరుణం రానే వస్తుంది
కోరిన ప్రియుడే సందిట వుంటే
గుండె చల్లబడిపోతుంది॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |