chaitramA chandramA - చైత్రమా చంద్రమా
చిత్రం : ప్రియుడు(priyuDu) (2011)రచన : చంద్రబోస్
సంగీతం : మోహన్ జోనా
గానం : కార్తీక్
పల్లవి :
చైత్రమా చంద్రమా
హృదయం నీ జత కదా
చెంతకే చేరగా సమయం కదలదు కదా॥
పెదవిలోనే కవితలెన్నో
పలుకసాగే మెరుపులై
అడుగులోనే పరుగులెన్నో
ఉరకలేసే ఉరుములై
మొదలాయే మనసు కథ
మనసంతా మగువ కదా
చరణం : 1
అనుకోని రాగాలెన్నో
అనలేని భావాలెన్నో
ఇవాళ నాలో ఉదయించేనా
నాలోని నీకై కదిలేనా
స్వప్నాలన్నీ లేఖలుగా
సందళ్లే కోకిలకిలగా
సరదాలన్నీ చిలకలుగా
కోరికలే నెమలీకలుగా
నాక న్నా ఇక వేగంగా నిన్నే చేరేనా
చరణం : 2
గతమంతా నువ్వే నువ్వే
గడిపింది నాతో నువ్వే
ప్రతిసారి నిన్నే కాదన్నానా
తొలిసారి నిన్నే గుర్తించానా
నీ రూపం నా చూపులుగా
నీ స్నేహం కొన ఊపిరిగా
నీ స్పర్శే సంజీవనిగా
నీ కరుణే కులదేవతగా
ప్రేమించి నిను పూజింప మళ్లీ పుట్టానా॥
External Links:
chaitramA chandramA (audio)-చైత్రమా చంద్రమా
Priyudu Full Songs (Audio) |Link|