Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

vasudEvasutam dEvam - వసుదేవ సుతం దేవం

చిత్రం : గృహలక్ష్మి(gruhalakshmi) (1984)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : సత్యం, గానం : పి.సుశీల


శ్లోకం :
వసుదేవ సుతం దేవం
కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుమ్‌॥
పల్లవి :
మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా
మా మేలు చూసే
చల్లని దైవం నీవయ్యా ॥
నీ ముద్దు మోమును చూడాలి
మా పొద్దు అప్పుడే పొడవాలి
నీ నవ్వే వెలుగై నిండాలి కృష్ణా... ॥
చరణం : 1
నీవిచ్చిన సౌభాగ్యం
దీవించిన సంసారం
నీ నీడన నిలకడగా నిలవాలి॥
నెలవంక వెన్నెలగా పెరగాలి
నిన్ను నమ్మి ఉన్నాము కృష్ణా...॥
చరణం : 2
దేవకీవసుదేవులు రేపల్లె పౌరులు
నీ కోసమే ఎదురుచూస్తూ ఉన్నారు॥
సరసాలకు ఇది సమయం కాదురా
సందెవేళదాకైనా ఆగరా కృష్ణా...॥
చరణం : 3
నీ ధర్మం నెరవేర్చు
అది జన్మను కడతేర్చు
అని నీవే అన్నావు ఆ దారిని పోనివ్వు
మంచైనా చెడుగైనా
భరియించే బలమివ్వు కృష్ణా...॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |