evarikI talava~nchaku - ఎవరికీ తలవంచకు
చిత్రం : నిండు సంసారం(niNDu samsAram) (1968)రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల
29 July - నేడు సి.నారాయణరెడ్డి బర్త్‌డే
(c. nArAyana reddy birth day)
పల్లవి :
ఎవరికీ తలవంచకు
ఎవరినీ యాచించకు
గుండెబలమే నీ ఆయుధం
నిండుమనసే నీ ధనం॥
చరణం : 1
కండలు పిండే కష్టజీవులకు
తిండికి కరువుంటుందా?॥
నిజాయితీకై నిలిచేవారికి
పరాజయం ఉంటుందా?
మంచితనమ్మును మించిన పెన్నిధి (2)
మనిషికి వేరే ఉందా? (2)॥
చరణం : 2
చాలీచాలని జీతంతో
మిడిమేలపు కొలువులు కొలవకు॥
ముడుచుకుపోయిన ఆశలతో... హోయ్
మిడిమిడి బ్రతుకును గడపకు॥
చీకటి రాజ్యం ఎంతోకాలం
చెలాయించదని మరవకు (2)॥
చరణం : 3
జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయీ
ఎగరేసే నిచ్చెనలే కాదు
పడదోసే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విషవలయాలను
ఛేదించి ముందుకు పదవోయి (2)॥
External Link:
Evariki talavanchaku - audio