alanATi rAmachandruDi - అలనాటి రామచంద్రుడి
చిత్రం : మురారి (2001), రచన : సిరివెన్నెలసంగీతం : మణిశర్మ, గానం : జిక్కి, సంధ్య, సునీత
పల్లవి :
ఆ... ఆ... ఆ... ఆ...
అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి॥
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ
ఆ... ఆ... ఆ... ఆ...
తెలుగింటి పాలసంద్రము కని పెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ॥
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ... ఆ... ఆ... ఆ... ఆ...
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి
నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని
వెలవెలబోవమ్మా
చరణం : 1
పుత్తడిబొమ్మకు పుస్తెలు కడుతూ
పురుషుడి మునివేళ్లు
పచ్చని మెడపై వెచ్చగా రాసెను
చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన
తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి
విందులు చేసే సమయాన
ఆ... ఆ... ఆ... ఆ...
అందాల జంట అందరి కంటికి
విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళ గల జంటని
పదిమందీ చూడండి
తళతళ మెరిసిన ఆనందపు
తడిచూపుల అక్షతలేయండి॥
చరణం : 2
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన
గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్లు
ఈ చల్లని సమయాన
దేవుళ్ల పెళ్లి వేడుక లైనా ఇంత ఘనంగా జరిగేనా
ఆ... ఆ... ఆ... ఆ...
దేవుళ్ల పెళ్లి వేడుక లైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్లికి
జనమంతా రారండీ
తదుపరి కబురుల వివరములడగక
బంధవులంతా కదలండీ...॥