iTu rAyE iTu rAyE - ఇటు రాయే ఇటు రాయే
చిత్రం : దూకుడు (2011), రచన : భాస్కరభట్లసంగీతం : ఎస్.ఎస్.థమన్, గానం : రంజిత్, దివ్యపల్లవి :
నీ స్టైలే చ కాస్... నీ స్మైలే ఖల్లాస్...
నీ ఎనకే క్లాసు మాసు డ్యాన్సే...
ఇటు రాయే ఇటు రాయే
నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే
ఏయ్... ధడక్ ధడక్ అని
దేత్తడి దేత్తడి
ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్...
నడుము తడిమేశావ్
ఏయ్ పటక్ పటక్ అని గుప్పెడు గుండెని
కొరుక్ కొరుక్కొని నువ్ నమిలేశావ్... ఓ...
ఈ ఫ్రెంచి ఫిడేల్ జర దేఖ్‌రే... ఓ...
దీన్ తళుకు బెళుకు ఎహె సూపరే... ఓ...
ఏయ్... కిక్కులేని లైఫు అంటే ఉప్పులేని పప్పుచారు
కిస్సులేని జిందగీని ఒప్పుకోరె కుర్రకారు
ఏక్ పప్పీ దే... ॥రాయే॥
చరణం : 1
గుండుసూది ఉన్నది గుచ్చుకోవడానికే
గండుచీమ ఉన్నది కుట్టిపోవడానికే
మేరే దిల్లు ఉన్నది నీకు ఇవ్వడానికి
అది పడిపడి దొర్లెను చూడే
తేలులాంటి పిల్లడే వేలు పెట్టి చూడకే
తిమ్మిరాగనందిలే... ఓ...
ఏం జరగనివ్వు పర్లేదులే ఓహో... ఓ...
నిన్నదాక లొల్లిపెటి ్ట ఇప్పుడేంటె సుప్పనాతి
ఆడపిల్ల బైటపడితె అల్లరల్లదవ్వదేటి
ఓసి నా తల్లో... ॥రాయే॥
చరణం : 2
తేనెపట్టు ఉన్నది రేగిపోవడానికే
చీరకట్టు ఉన్నది జారిపోవడానికే
నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే
ఈ కిటకిట పరువం నీకే
ఈడు ఎందుకున్నదీ గోల చెయ్యడానికే
గోడ దూకడానికే... ఓ...
విదియ తదియలిక దేనికే... ఓ...
ఏయ్... విల్లులాంటి ఒళ్లు నాది భళ్లుమంటు విరుచుకోర
ఒంపుసొంపులోన ఉంది పాలధార పంచదార
ఏతమేసెయ్‌రో... ॥రాయే॥
నీ స్టైలే చ కాస్..