jayIbhava vijayIbhava - జయీభవ విజయీభవ
చిత్రం : దానవీరశూరకర్ణ (dAna veera sUra karNa)(1977)రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఎస్.పి.బాలు, జి.ఆనంద్
పల్లవి :
జయీభవ... విజయీభవ... (2)
చంద్రవంశ పాదోధి చంద్రమా
కురుకుల సరసీ రాజహంసమా
జయీభవ... విజయీభవ...
చరణం : 1
ధన్య గాంధారి గర్భ సుక్తి ముక్తాఫలా
మాన్య ధృతరాష్ట్ర తిమిర నయన తేజఃఫలా
దిగ్గజకుంభ విదారణచణ
శతసోదరగణ పరివేష్టితా
చతుర్దశ భువన చమూ నిర్దళన
చతుల భుజార్గళ శోభితా॥
చరణం : 2
కవిగాయక నట వైతాళిక
సంస్థూయమాన విభవాభరణా
నిఖిల రాజన్య మకుట మణిఘృణీ
నీరాజిత మంగళచరణా
మేరు శిఖరి శిఖరాయమాన
గంభీర ధీరగుణ మానధనా
క్షీర పయోధి తరంగ విమల
విస్ఫార యశోధన సుయోధనా
జగనొబ్బగండ జయహో
గండరగండ జయహో
అహిరాజకేతనా జయహో
ఆశ్రీతపోషణ జయహో
జయహో జయహో జయహో...