Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

nanu pAlimpaga naDachI - నను పాలింపగ నడచీ

చిత్రం : బుద్ధిమంతుడు(buddimantuDu) (1969)
రచన : దాశరథి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల
22 July - నేడు దాశరథి జయంతి


సాకీ :
వేయి వేణువులు మ్రోగేవేళ... ఆ ఆ...
హాయి వెల్లువై పొంగేవేళ
రాసకేళిలో తేలేవేళ...
రాధమ్మను లాలించే వేళ
పల్లవి :
నను పాలింపగ నడచీ వచ్చితివా..
మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా...॥
చరణం : 1
అరచెదిరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ
అరజారిన పయ్యెదతో అదిగదిగో గోపెమ్మ
ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ
పొద పొదలో ఎద ఎదలో...
నీ కొరకై వెదుకుచుండగా ॥
చరణం : 2
కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్లలో ఖైదీవై పెరిగావు
కరకు రాతి గుళ్లలో ఖైదీగా నిలిచావు
ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని...॥

Special Note:
పూర్తిపేరు : దాశరథి కృష్ణమాచార్య
జననం : 22-07-1925
జన్మస్థలం : వరంగల్ జిల్లా, మానుకోట తాలూకా చినగూడూరు
తల్లిదండ్రులు : వెంకటమ్మ, వేంకటాచార్యులు
తోబుట్టువులు : తమ్ముడు (దాశరథి రంగాచార్య),చెల్లెళ్లు(శకుంతల, అరుణ, రమాదేవి)
చదువు : బి.ఏ.
వివాహం - భార్య : జూన్, 1950 - లక్ష్మి
సంతానం : కుమార్తె (ఇందిర), కుమారుడు (లక్ష్మణ్)
తొలిచిత్రం-పాట : వాగ్దానం (1961) -నా కంటిపాపలో నిలిచిపోరా...
పాటలు : సుమారు 650
నటించిన సినిమాలు : చదువుకున్న అమ్మాయిలు (1963), శభాష్ పాపన్న (1972)
గౌరవపురస్కారాలు : దాశరథి రచనలలో ‘గాలిబ్ గీతాలు’కు మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తమ అనువాద గ్రంథ బహుమతి (1965), ‘కవితాపుష్పకం’ కవితా సంపుటికి సాహిత్య అకాడమీ పురస్కారం (1967), ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (1974)’ లభించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి నుండి ‘కళాప్రపూర్ణ’, ఆగ్రా విశ్వవిద్యాలయం వారి నుండి డి.లిట్. గౌరవ పట్టా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్ పట్టాతో సన్మానించాయి.
ఇతర విషయాలు : దాశరథి డి గ్రీ పట్టా పుచ్చుకున్న తర్వాత ప్రభుత్వంలో పంచాయితీశాఖలో పనిచేశారు. ఆ తర్వాత 1956-63 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో, 1963-71 వరకు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలోను పనిచేశారు. 1977 ఆగష్టు 15న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దాశరథిని ఆస్థానకవిగా నియమించి గౌరవించారు. 1983లో ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆస్థానకవి పదవిని రద్దు చేయడంతో దాశరథి కలతపడ్డారు.
మరణం : 05-11-1987

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |