Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

enduku chentaku vastAvO - ఎందుకు చెంతకు వస్తావో

చిత్రం : కొంచెం ఇష్టం కొంచెం కష్టం(ko~mcham ishtam ko~mcham kashtam) (2009)
రచన : సిరివెన్నెల
సంగీతం : శంకర్-ఎహసాన్-లోయ్
గానం : ఉన్నికృష్ణన్
09 July - నేడు ఉన్నికృష్ణన్ బర్త్‌డే


పల్లవి :
ఎందుకు చెంతకు వస్తావో
ఎందుకు చేయి వదిలేస్తావో
స్నేహమా... చెలగాటమా...
ఎపుడు నీ ముడి వేస్తావో
ఎపుడెలా విడదీస్తావో
ప్రణయమా... పరిహాసమా...
శపించే దైవమా
దహించే దీపమా
ఇదే నీ రూపమా ప్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా
గెలిస్తే నష్టమా ప్రేమా
చరణం : 1
ఈ కలత... చాలే మమత
మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా
మరలిరాని గతముగానే మిగిలిపోతావా
రెప్పలు దాటవు స్వప్నాలు
చెప్పక తప్పదు వీడ్కోలు
ఊరుకో... ఓ హృదయమా...
నిజం నిష్టూరమా వేదిస్తే కష్టమా
కన్నీటికి చెప్పవే ప్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా

గెలిస్తే నష్టమా ప్రేమా
చరణం : 2
వెంట రమ్మంటు తీసుకె ళతావు
నమ్మివస్తే నట్టడవిలో
విడిచిపోతావు
జంట కమ్మంటూ
ఆశ పెడతావో
కలిమి ఉంచే చెలిమి తుంచే
కలహమవుతావో
చేసిన బాసలు ఎన్నంటే
చెప్పిన ఊసులు ఏవంటే
మౌనమా... మమకారమా...
చూపుల్లో శూన్యమా గుండెల్లో గాయమా
మరి వేదించకే ప్రేమా
తరరా రారరా తరరా రారరా తరరా రారరా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |