manassA ekkaDunnAv - మనస్సా ఎక్కడున్నావ్
చిత్రం : చూడాలనివుంది (1998),
రచన : వేటూరి సంగీతం : మణిశర్మ, గానం : ఎస్.పి.బాలు, చిత్ర
పల్లవి :
మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవాళ చెప్పడం
నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా
నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా
ఇది అందమైన వింత ఆత్మకథ॥
చరణం : 1
హంస గీతమే వినరాదా హింస మానరా మదన
తెల్లవారిన తరువాత తెల్లబోకుమా లలనా
ఇప్పుడే విన్నాను చలి వేణువేదో
నిదరే ఇక రాదు లేవమ్మా
చెవులే కొరికింది చెలిమింటి మాట
ఎదలే ఇక దాచలేవమ్మా
పూలగాలికి పులకరం గాలి ఊసికే కలవరం
కంటిచూపులో కనికరం కన్నెవయసుకే తొలివరం
మొదలాయే ప్రేమ క్లాసు రాగసుధా॥
చరణం : 2
రాయలేనిదీ ప్రియలేఖ రాయబారమే వినమా
వేదమంటివి శుభలేఖ వెన్నెలంటని కలువా
పురులే విరిసింది నీలో వయ్యారం
కనులే తెరిచిందిలే పింఛం
వెలిగే నీలోన గుడిలేని దీపం
ఒడిలో తేరింది ఆ లోపం
ఎంకి పాటలో తెలుగులా తెలుగు పాటలో తేనెలా
కలవని హాలా మమతలా
తరగని ప్రియా కవితలా
బహుశా ఇదేమో భామ ప్లస్సు కదా॥